Saturday, April 27, 2024

ఎన్నికల వేళే రాజకీయాలు చేయాలి….

- Advertisement -
- Advertisement -

ఎన్‌ఆర్‌ఐల సేవ తత్పరత ప్రశంసనీయం
ములుగు ఎమ్మల్యే సీతక్క
పర్వతగిరి గ్రామంలో ఎన్‌ఆర్‌ఐ తిరుపతి రెడ్డి
ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

మనతెలంగాణ/మహబూబాబాద్ ప్రతినిధి: రాజకీయాలు ఎన్నికల సమయంలోనే చేయాలని.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ప్రజాప్రతినిధులుగా ఎవరున్నప్పటికీ అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ పరంగా అ ందాల్సినవి అందించేందుకు రాజకీయాలకు అతీతంగా తోడ్పాటు అ ందించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మండలంలోని పర్వతగిరి గ్రామంలో ‘ఆటా’ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యలు, ఎన్‌ఆర్‌ఐ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏ ర్పాటు చేసిన ఉచిత వైద్య, నేత్ర, పంటి శిభిరం, స్వచ్చమైన వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించే కార్యక్రమానికి సీతక్క ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. డాక్టర్ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి అద్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీతక్క మాట్లాడుతూ కష్టపడి ఉన్నత చదువులు చదువుకుని విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు చేసుకుంటూ ఆహర్నిశలు కష్టపడుతు తాము సంపాదించిన కొంత సొమ్మును జన్మభూమి అభివృద్ది కోసం అంకితభావంతో పరితపించడం అభినందనీయమని పేర్కోన్నారు.

తిరుపతిరెడ్డి లాంటి వారు అతి సామాన్యమైన జీవితం గ్రామంలో గడిపి స్థానికంగానే చదువులు కొనసాగించి నిట్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో పీహెచ్‌డీ పూర్తి చేసుకుని అమెరికాలో ఉన్నత ఉద్యోగం చేస్తూ పుట్టిన ఊరికి మేలు చేయాలని పరితపించడం అభినందనీయమని వివరించారు. ఆయన స్పూర్తితో ప్రతీ ఎన్‌ఆర్‌ఐలతో పాటు ఉన్నతంగా ఆర్థికంగా ఎదిగిన ప్రతీ ఒక్కరూ గ్రామ సేవలో పునరంకితులు కావాలని పిలుపునిచ్చా రు. ఆటా ప్రతినిధులందరినీ కూడా భాగస్వాములు అవుతూ తమ కు టుంబాలను కూడా పట్టించుకోకుండా పుట్టిన ఊరు, పెరిగిన ప్రా ంతాలు, కన్న దేశానికి తమ తోడ్పాటునందించేందుకు అనేక రూపాల్లో సేవా కార్యక్రమాలకు పూనుకుంటున్న వారి సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. సింపుల్‌సిటితో సామాజిక బాద్యతలను కూడా మీ దు వేసుకుంటున్న ఆటా ప్రతినిధులు చేపడుతున్న కార్యక్రమాలకు గ్రా మస్థాయిలో ప్రోత్సహించాలని సూచించారు.

కానీ రాజకీయాల ముసుగులో వారు చేస్తున్న కార్యక్రమాలకు అడ్డుకునే ప్రయత్నాలు చేయడం అవివేకమన్నారు. ఏ పార్టీకి వారికి సంబంధం ఉండబోదన్నారు. వారు నిజాయితీగా జన్మనించిన గడ్డకు సేవలు అందించేందుకు ముందుకు రావడాన్ని రాజకీయాలకు అతీతంగా స్వాగతిస్తూ ఎంకరేజ్ చేయడం వల్ల గ్రామానికి ఉపయోగపడే మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టే పరిస్థితులు ఉంటాయన్నారు. మాజీ ఎమ్మెల్యే, పీసీసీ ఉపాద్యక్షులు వేం న రేందర్‌రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఆటా ప్రతినిధులు త్యాగధునులని పేర్కోన్నారు. వారు తమ స్వగ్రామాలకు మేలు కలిగించేందుకు ఎంతగానో ఉత్సాహంతో వచ్చి కార్యక్రమాలను చేపడుతుంటే వారిని ప్రోత్సహిస్తే మరిన్ని కార్యక్రమాలను చేపట్టేందుకు ముందుకు వచ్చే అవకాశాలుంటాయన్నారు. వారి సేవలను ఉపయోగించుకుంటూ గ్రామాభివృద్దికి రాజకీయాలకు అతీతంగా తో డ్పాటు అందించాలని పిలుపునిచ్చారు.

ఆటా అద్యక్షులు భూవనేశ్ భూ జాల మాట్లాడతూ ఆటా తరుపున జన్మనిచ్చిన ఊర్ల అభివృద్దికి బాటలు వేసేందుకు తమవంతు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. డాక్టర్ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ తాను ఈ గ్రామంలో పుట్టి పెరిగి ఇక్కడే అతి సామాన్యమైన జీవితాన్ని గడిపానని వివరించారు. కష్టపడి ఉన్నత చదువులు చదువుకుని అమెరికాలో సై ంటిస్టుగా స్థిరపడి పుట్టిన తన ఊరి అభివృద్దికి తోచిన కార్యక్రమాలను చేపడుతూవస్తున్నానని వెల్లడించారు. రాబోవు రోజుల్లో కూడా తమ సే వా కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు. మానుకోట ఏరియాసుపత్రిలో రూ. ఇరవైమూడు లక్షలతో ఎన్‌ఆర్‌ఐలు ఐసీయూ కేంద్రం ఏ ర్పాటు చేశామన్నారు. గ్రామంలో రూ. పది లక్షల వరకు వివిధ సేవా కార్యక్రమాలను ఖర్చు చేసినట్లు చెప్పారు. డోర్నకల్, మహబూబాబాద్ కాంగ్రెస్ నేతలు డాక్టర్ రాంచంద్రు, డా క్టర్ మురళీనాయక్, రాథ, జి న్నారెడ్డి పద్మజా వెంకటేశ్వర్లు, ఉదయ్‌చందర్, రిటైర్ట్ తహసిల్దార్ పరకాల శ్రీనివాస్‌రెడ్డి, రిటైర్డ్ డీఈ ఎర్రంరెడ్డి సుధీర్‌రెడ్డి ,ఆటా ప్రతినిధులు మధు బొమ్మినేని, అనిల్ బొద్దిరెడ్డి, రామకృష్ణారెడ్డి, మురళీ రెడ్డి, సా యి, శారద, ఎంపీటీసీ రాంచంద్రునాయక్, సర్పంచ్ బాలాజీ, నరేష్, అబ్రహం, ప్రధానోపాధ్యాయులు లింగమూర్తి, రాందాస్‌లున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News