Monday, May 6, 2024

మోడీ… గుజరాత్‌కు ఇచ్చారు… తెలంగాణ ఎందుకు ఇవ్వరు: రేవంత్

- Advertisement -
- Advertisement -

Revanth Reddy demands PM Modi apology to Telangana People

హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యాల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేయాలని టిపిసిసి ప్రెసిడెంట్ , ఎంపి రేవంత్ రెడ్డి సూచించారు.  భారీ వర్షాలు,  వరదలతో రాష్ట్రంలో 3 వేల కోట్ల రూపాయల నష్టం జరిగిన కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించడంలేదని మండిపడ్డారు.  40 మంది వరదలతో చనిపోయారని వారి కుటుంబాలు అనాధలుగా మారారని, వారిని ఆదుకోవాలన్నారు.  మోడీ గుజరాత్ రాష్ట్రానికే ప్రధానిగా ఉన్నారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

గుజరాత్ లో వరదలు వస్తే ప్రధాని మోడీ పర్యటించడంతో పాటు వేల కోట్లు విడుదల చేశారని, తెలంగాణను కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి, ఇతర బిజెపి ఎంపిలు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోయారని మండిపడ్డారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తోందని, ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి రాష్ట్ర నాయకులు తెలంగాణను మోసం చేస్తున్నారని విరుచుక పడ్డారు. రాష్ట్ర సమస్యలపై ప్రధాని నరేంద్ర మోడీని కలుద్దాం అంటే తమకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదని రేవంత్ రెడ్డి తెలిపారు.  కాంగ్రెస్ ఎంఎల్ఎ కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అంశంపై పార్టీ అంతర్గతంగా చర్చిస్తుందని,  ఈ విషయంపై హై కమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. గత కొన్ని రోజుల నుంచి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరుతానని ప్రకటించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News