Saturday, April 27, 2024

మార్కెట్లోకి మోటో జి10 పవర్, మోటో జి30

- Advertisement -
- Advertisement -

Moto G10 Power and Moto G30 in the market

 

మొబైల్ తయారీ సంస్థ మోటరోలా రెండు కొత్త ఫోన్లు మోటో జి10 పవర్, మోటో జి30ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిలో ఆండ్రాయిడ్ 11 ఒఎస్‌తో పాటు ఆధునిక భద్రత కోసం మోటరోలా థింక్‌షీల్డ్‌ను ఇచ్చారు. మోటో జి10 పవర్ శక్తిమంతమైన 6000 ఎమ్‌ఎహెచ్ బ్యాటరీ సామర్థాన్ని కల్గివుంది. దీంతోపాటు 48 ఎంపి క్వాడ్ కెమెరా, 4 జిబిర్యామ్, 64 జిబి స్టోరేజ్ లాంటి ఎన్నో ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ మార్చి 16 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.9999గా నిర్ణయించారు. ఇక మోటో జి30 విషయానికి వస్తే 64 ఎంపిక్వాడ్ కెమెరా సిస్టమ్ 4 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్‌తో స్నాప్‌డ్రాగన్ 662తో వస్తోంది. దీని ధరని రూ.10,999గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ఫోన్ మార్చి 17 మధ్యాహ్నం 12 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News