Saturday, May 4, 2024

పెద్దమ్మ, పెద్దనాన్నలు అత్యంత విలువైన వారు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం కెసిఆర్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా టిఆర్‌ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. సిఎం కెసిఆర్ దంపతులతో పాటు, సంతోష్‌కుమార్ తల్లిదండ్రుల పెళ్లిరోజు కూడా గురువారమే కావడం విశేషం. ట్విట్టర్ వేదికగా ఈ రెండు జంటలకు సంతోష్‌కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రులుగా అమ్మానాన్నలను కలిగి ఉన్నందుకు తాను ధన్యుడినని ఆయన పేర్కొన్నారు. తన జీవితంలో పెద్దమ్మ, పెద్దనాన్నలు అత్యంత విలువైన వారంటూ కెసిఆర్, శోభ దంపతులను ఉద్ధేశించి సంతోష్ వ్యాఖ్యానించారు. వారు చిరకాలం ఆరోగ్యంగా, సం తోషంగా జీవించాలని కోరుతున్నానంటూ సంతోష్ ట్వీట్ చేశారు. దీంతోపాటు ఆ రెండు జంటల పెళ్లినాటి ఫొటోలతో పాటు ఇప్పటి ఫొటోలను ట్వీట్‌కు సంతోష్‌కుమార్ జత చేశారు.

MP Santhosh wedding Anniversary Wishes KCR Couple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News