Friday, April 26, 2024

‘కస్టడీ’ డబ్బింగ్ షురూ..

- Advertisement -
- Advertisement -

హీరో అక్కినేని నాగచైతన్య, దర్శకుడు వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు,-తమిళ ద్విభాషా చిత్రం ’కస్టడీ’. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

తాజాగా ‘కస్టడీ’ డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. ఈ సందర్భంగా నాగ చైతన్య స్టూడియోలో డబ్బింగ్ చెబుతున్న ఫోటోని షేర్ చేశారు. ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా.. ప్రియమణి పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది. ‘కస్టడీ’ మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News