Monday, April 29, 2024

ఓ డాలరు పిలగా…

- Advertisement -
- Advertisement -

డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తన తొలి పాన్ ఇండియా చిత్రం ’దాస్ కా ధమ్కీ’ అత్యంత భారీ బడ్జెట్‌తో అత్యున్నత నిర్మాణ విలువలతో రూపొందిస్తున్నారు. విశ్వక్ ఈ చిత్రానికి కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత కూడా. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఓ డాలరు పిలగా’ పాటని విడుదల చేశారు మేకర్స్, లియోన్ జేమ్స్ ఈ పాటని పెప్పీ పబ్ నెంబర్ గా క్యాచిగా కంపోజ్ చేశారు.

మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఈ పాటని తన వాయిస్‌తో మైమరపించారు సింగర్ మంగ్లీ. ఈ పాటలో విశ్వక్ లుక్స్ స్టన్నింగా వున్నాయి. రావు రామేష్, థర్టీ ఇయర్స్ పృథ్వీ కూడా ఈ పాటలో సందడి చేశారు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్‌సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News