Monday, May 6, 2024

నింగిలోకి దూసుకెళ్లిన జేమ్స్ వెబ్‌స్పేస్ టెలిస్కోప్

- Advertisement -
- Advertisement -

NASA James Webb Space Telescope launch

విశ్వ రహస్యాల పరిశోధనలో ఇదో ముందడుగు

కొరొయు ( ఫ్రెంచి గయానా ) : ప్రపంచం లోనే భారీ, అత్యంత శక్తివంతమైన అంతరిక్ష టెలిస్కోప్ రాకెట్ ను ఫ్రెంచి గయానా అంతరిక్ష కేంద్రం నుంచి శనివారం ప్రారంభించారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు (జెడబ్లుఎస్‌టి)గా పేర్కొనే ఈ టెలిస్కోపు రాకెట్‌ను భారత కాలమానం ప్రకారం సరిగ్గా శనివారం సాయంత్రం 5.50 గంటలకు ఎరియాన్ 5 రాకెట్ విజయవంతంగా నింగి లోకి మోసుకెళ్లింది. నింగి లోకి దూసుకెళ్లిన ఈ టెలిస్కోపు 1.6 మిలియన్ కిలో మీటర్ల దూరంలో ఉన్న గమ్యానికి చేరుకోడానికి వివిధ దశలను దాటుకుని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశించడానికి దాదాపు నెల రోజులు పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. చంద్రగోళం కన్నా నాలుగు రెట్లు దూరంలో ఈ గమ్యం ఉంది. 70 అడుగుల పొడవు, 46 అడుగుల వెడల్పు ఉన్న ఈ టెలిస్కోప్ టెన్నిస్ కోర్టు అంత సైజు ఉంటుంది. ఐదు పొరల సన్‌షీల్డ్ రక్షణ కవచంతో కాంతిని గ్రహించే దర్పణంతో వేడిని గ్రహించ గలిగే ఇన్‌ఫ్రారెడ్ డిటెక్టర్లతో దీన్ని రూపొందించారు.

విశ్వం పుట్టుక, తొలినాళ్లలో గెలాక్సీల గుట్టును విశ్వం గుట్టు ఛేదించే సామర్ధం ఉంది. కంటికి కనిపించే నక్షత్రాలను వెయ్యికంటే కోట్ల రెట్ల స్పష్టతతో ఈ భారీ టెలిస్కోప్ చూపిస్తుంది. హబుల్ టెలిస్కోప్ కంటే వందరెట్లు స్పష్టతతో ఫోటోలు తీస్తుంది. నక్షత్రాలు, పాలపుంతలతోపాటు బిగ్‌బ్యాంగ్ తరువాత ఏర్పడిన తొలినాటి నక్షత్ర మండలాలను వెబ్‌స్పేస్ సహాయంతో శాస్త్రవేత్తలు పరిశీలించనున్నారు. ఖగోళశాస్త్రంలో అంతులేని ప్రశ్నలకు జవాబులు కనుగొనే దిశగా ప్రయాణం ప్రారంభించిన ఈ టెలిస్కోప్ రాకెట్ 5 నుంచి 10 ఏళ్ల పాటు సేవలు అందించనున్నది. అమెరికా, ఐరోపా, కెనడా, అంతరిక్ష పరిశోధన సంస్థలు సంయుక్తంగా రూ. 73 వేల కోట్ల తో దీన్ని రూపొందించాయి. వినూత్న పరిజ్ఞానం, భారీ వ్యయప్రయాసలతో రూపొందిన ఈ అత్యాధునిక టెలిస్కోపు అందించబోయే డేటా వెలుగు లోకి తెచ్చే సరికొత్త విషయాల గురించి ప్రపంచ వ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పరిశోధనల కోసం ఒక కొత్త రంగాన్ని తీసుకొచ్చే సామర్ధం ఈ ప్రయోగానికి ఉందని, విశ్లేషణలు వెలువడుతున్నాయి. 1990 లో ప్రయోగించిన హబుల్ స్పేస్ టెలిస్కోపు విశ్వానికి సంబంధించిన అనేక నిగూఢ వివరాలను అందించింది. దీని వారసురాలిగా జెడబ్లుస్‌టీని చెప్పుకోవచ్చు. ఈ టెలిస్కోపు పరిశోధన వల్ల మనం ఎవరిమో, ఏమిటో, తదితర విశ్వ రహస్యాలను ఛేదిస్తుందని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ ఈ వారం మొదట్లో వెల్లడించారు. అంతపెద్ద లక్షాన్ని సాధించాలంటే పెద్ద రిస్కు తీసుకోక తప్పదన్నారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో చేపట్టిన ఈ ప్రయోగ ప్రారంభాన్ని తిలకించడానికి ఫ్రెంచి గయానాకు చాలా కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News