Monday, April 29, 2024

బిజెపితో రేవంత్ కుమ్మక్కు

- Advertisement -
- Advertisement -
TRS MLA Jeevan Reddy Comments on Revanth Reddy
రేవంత్, బిజెపి నేతలు బూతులకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు
కాంగ్రెస్ పార్టీ నిర్వహించేది రచ్చబండ కాదు..
తమ పతనానికి తవ్వుకుంటున్న బొంద
తెలంగాణ రాష్త్ర ప్రజలను బిజెపి అవమానిస్తోంది
టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపాటు

హైదరాబాద్: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టిఆర్‌ఎస్‌ఎల్పీలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బిజెపితో రేవంత్‌రెడ్డి కుమ్మక్కయ్యాడని ఆరోపించారు. రైతులకు కెసిఆర్ అన్ని వసతులు కల్పించి బ్రాండ్ అంబాసిడర్‌గా మారితే.. రేవంత్, బిజెపి నేతలు బూతులకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌కు రేవంత్‌రెడ్డి వకాల్తా పుచ్చుకుని బిజెపికి బంట్రోతుగా మారిపోయారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించేది రచ్చబండ కాదు.. తమ పతనానికి తవ్వుకుంటున్న బొంద అని విమర్శించారు.

కాంగ్రెస్ ఎన్ని అవమానాలకు గురిచేసినా కెసిఆర్ తెలంగాణను సాధించారన్నారు. ఇప్పుడు బిజెపి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవమానిస్తోందన్నారు. ఎముకలు కొరికే చలిలో తెలంగాణ రైతుల కోసం టిఆర్‌ఎస్ మంత్రులు, ఎంపిలు ఢిల్లీలో పోరాడారని, ఎన్నో విధాలుగా కేంద్రాన్ని తెలంగాణ బియ్యం కొనాలని ఒత్తిడి తెచ్చామన్నారు. ఎఫ్‌సిఐకి ఏడు సార్లు లేఖలు రాసినా పియూష్ గోయల్ ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణకు కేంద్రం, బిజెపి చేసిందేమీ లేదన్నారు.

తీన్మార్ మల్లన్నపై ఆగ్రహం

రేవంత్, తీన్మార్ లాంటి చిల్లర వ్యక్తులు కెసిఆర్ కుటుంబ సభ్యులపై చిల్లర భాష వాడుతుండడాన్ని తెలంగాణ సమాజం ముక్తకంఠంతో ఖండింస్తోందని జీవన్‌రెడ్డి తెలిపారు. తీన్మార్ మల్లన్న జర్నలిస్తు కాదు.. బ్లాక్ లిస్టులో ఉన్న బిజెపి నేత అని దుయ్యబట్టారు. కెటిఆర్ కుమారుడిపై వాడిన భాషను అమిత్‌షా కొడుకుపై వాడితే బిజెపి నేతలు సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. తీన్మార్ మల్లన్న తన తీరు మార్చుకోకపోతే టిఆర్‌ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ ఆయనను తరిమే రోజులు వస్తాయని జీవన్‌రెడ్డి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News