Sunday, April 28, 2024

సూర్య దిగ్రేట్..

- Advertisement -
- Advertisement -

NASA Snaps Closest Pictures of the Sun

క్యాంప్‌ఫైర్ల రారాజు
నాసా క్లోజ్ షాట్స్ విడుదల

కేప్ కెనవెరాల్ (అమెరికా) : మంటలు రేపే సూరీడే …చలి మంటలు వేసుకున్నట్లు కన్పిస్తే…చెప్పలేని ఆ మహాచిత్రం విశ్వవిచిత్రమే అవుతుంది. సూర్యుడిని తొట్టతొలిసారిగా అంతరిక్ష నౌక నుంచి ఇంతకు ముందెన్నడూ లేనంత దగ్గరి నుంచి క్లిక్ మన్పించారు. ఈ ఘనత అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా), యూరోపియన్ స్పేస్ క్రాఫ్ట్ సాంకేతికతకే దక్కుతుంది. చలికాలపు వేళలో మంటలు వేసుకున్నట్లుగా సూర్యుడి చుట్టూ విశాలవిస్తీర్ణంలో అసంఖ్యాక మంటలు ఉన్నాయని పేర్కొంటూ నాసా సంస్థ ఇప్పుడు ఈ క్యాంప్ ఫైర్స్ ఛాయాచిత్రాలను భూ కేంద్రానికి పంపించింది. సూర్యుడి గురించి బోలెడు రహస్యాలను సంగ్రహించేందుకు కెప్‌కెనవెరాల్ నాసా కేంద్రం నుంచి ఈ ఏడాది ఫిబ్రవరిలో స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపించారు.

మండే అగ్నిగోళం వంటి సూరీడి సుందరదృశ్యాలను అతి దగ్గరి నుంచి చిత్రీకరించే సరంజామా అంతా ఈ వ్యోమనౌకలో ఉంది. దీని సాయంతో ఇప్పుడు అత్యంత సాంద్రత గల క్యాంప్‌ఫైర్స్ దృశ్యాలను భూగోళ ప్రజలకు చూసేందుకు సైంటిస్టులు గురువారం విడుదల చేశారు. ఈ వ్యోమనౌక సూర్యుడికి 4.8 కోట్ల మైళ్లు లేదా 7.7 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే భూమికి అటు సూర్యుడికి దాదాపుగా మధ్యలో నెలకొని ఉంది. అక్కడి నుంచి ఈ చిత్రాలను గతనెలలో తీసింది. వీటిని ఇప్పటికి భూ కేంద్రానికి పంపించింది. నాసా నుంచి ప్రయోగించిన ఈ వ్యోమనౌక నుంచి పలు అత్యద్భుత సూర్యుడి లోగుట్లు తెలుస్తాయని, ఇంతవరకూ ఎవరికి తెలియని రహస్యాలను ఛేదించేందుకు సిద్ధమయ్యామని, ఇది సూర్యుడితో మరింత పరిచయం పెంచుకునే యుద్ధం అని నాసావర్గాలు తెలిపాయి.

వ్యోమనౌక ఇప్పుడు సూర్యుడి కక్షకు సమీపంలోకి వచ్చింది. అయితే ఇది పూర్తిగా సూర్యుడికి చేరువ అని అనుకోరాదు. అయితే కెమెరాల నుంచి సూర్యుడిని చిత్రీకరించేందుకు వీలైన దూరంవరకూ చేరుకున్నట్లు ఇప్పుడు వెల్లడైంది. సూర్యుడి నుంచి వెలువడే వాయువుల తాకిడి లేకుండా చూసుకుంటూ ఈ కెమెరా ఫోటోలు తీసింది. అయితే ఇప్పుడు వెలువడ్డ చిత్రాలలో పసుపు పచ్చ, దట్టమైన పొగమంచు రంగుల తరహాలో తీవ్రస్థాయి వలయాలు కూడా కన్పిస్తున్నాయి. ఇవి సూర్యుడి నుంచి వెలువడే వాయువుల తరంగాల దృశ్యాలని సైంటిస్టులు తేల్చారు. ఇటువంటి ముచ్చటైన వాటికి తగు పేరు పెట్టడం కుదరడం లేదని, కొత్త పేరుతోనే ఈ అందాలను పరిచయం చేయాల్సి ఉంటుందని చమత్కరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News