Monday, April 29, 2024

140 మంది టిటిడి సిబ్బందికి కరోనా

- Advertisement -
- Advertisement -

140 TTD Staff Tested Corona Positive

తిరుమల: ఇటీవల ట్విట్టర్ వేదికగా టిటిడి ఈవో, జెఈవో లమీద మాజీ ప్రదాన అర్చకులు రమణదీక్షితులు చేసిన వ్యాఖ్యలకు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆయన సలహాలు సూచనలు ఇవ్వదలచుకుంటే నేరుగా కలిసి ఇవ్వాలని అన్నారు. అంతే కానీ బహిరంగ విమర్శలు చేయడం సరికాదని అన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనాలు పున: ప్రారంభించాక ఇప్పటివరకూ 140 మంది ఉద్యోగులకు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చేందుతున్న క్రమంలో తిరుమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో అధికారులతో సమావేశం అయినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

తిరుమలలో అధిక శాతం ఏపీఎస్పీలో పని చేసే సెక్యురిటీ సిబ్బందికి, పోటు కార్మికులకే కరోనా నిర్ధారణ అయిందని, 70 మంది వరకు కరోనా నుంచి కొలుకున్నారని, వారిలో కొందరు హోమ్ క్వారంటైన్ లో ఉన్నారని, మరి కొందరు డ్యూటీలకు హాజరవుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న 70 మంది ఆరోగ్యం నిలకడగానే ఉందని, అయితే అందులో ఒక్కరు మాత్రమే ఐసియులో చికిత్స పొందుతున్నారని ఛైర్మన్ తెలిపారు. రమణ దీక్షితులు గౌరవ ప్రధాన అర్చకుల హోదాలో ఉండి ట్విటర్ వేదికగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని, బోర్డుకు సలహాలు ఇవ్వాలే కానీ మీడియాలో వ్యాఖ్యలు చేయడం రమణ దీక్షితులకు సబబు కాదన్నారు.

140 TTD Staff Tested Corona Positive

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News