Tuesday, April 30, 2024

నాగాలాండ్ అసెంబ్లీలో 58ఏళ్ల తరువాత జాతీయ గీతాలాపన

- Advertisement -
- Advertisement -

National anthem plays in Nagaland assembly after 58 years

కొహిమా:ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ అసెంబ్లీలో 58 ఏళ్లుగా జాతీయ గీతాన్ని ఆలపించే సంప్రదాయం లేదు. 1962 లో ఈ రాష్ట్రం ఏర్పాటైంది. అప్పటి నుంచి ఈ ఆనవాయితీ లేక పోయినా ఈనెల 12న మొట్టమొదటిసారి అసెంబ్లీ సమావేశం జాతీయ గీతాలాపనతో మారుమోగింది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో గవర్నర్ ఆర్‌ఎన్ రవి ప్రసంగం ప్రారంభానికి ముందు జాతీయ గీతం ఆలపించి కొత్త సంప్రదాయానికి నాంది పలికారు. అసెంబ్లీ ఈ విధంగా చరిత్ర సృష్టించిందని మంత్రి, నాగాలాండ్ బిజెపి అధ్యక్షుడు తెమ్జెన్ ఇమ్నా హర్షం వెలిబుచ్చారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అసెంబ్లీలో ఎందుకు జనగణమన గీతం ఎందుకు ఆలపించడం లేదో తమకు తెలీదని అసెంబ్లీ అధికారులు పేర్కొన్నారు. స్పీకర్ షరీన్‌గైర్ నేతృత్వంలో ముఖ్యమంత్రి నెప్యూరియో ఆధ్వర్యంలో ఇది జరగడం విశేషంగా చెప్పుకుంటున్నారు.

National anthem plays in Nagaland assembly after 58 years

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News