Tuesday, April 30, 2024

నీట్ పిజి పరీక్ష వాయిదా..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వైద్య విద్యకు సంబంధించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్) పిజి పరీక్షలను నాలుగు నెలలపాటు వాయిదా వేశారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం సోమవారం తెలిపింది. దేశంలో కొవిడ్ రోగుల చికిత్సకు అత్యధిక సంఖ్యలో ఎంబిబిఎస్ పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థుల సేవలను విరివిగా తీసుకోవాలని, వారికి క్షేత్రస్థాయిలో కొవిడ్ చికిత్సకు సంబంధించి అవగావహన కల్పించడం, ఈ దశలోనే వైరస్ నియంత్రణకు అవసరం అయిన వైద్య సిబ్బంది ఎక్కువగా అందుబాటులోకి రావడం జరుగుతుందని ప్రధానిమోడీ భావించారు. దీనితో ఎండి సంబంధిత పిజి పరీక్షలకు విద్యార్థులు వెళ్లకుండా చేసే దిశలో నీట్ పరీక్షలను నాలుగు నెలల పాటు వాయిదా వేశారని వెల్లడైంది. ఎంబిబిఎస్ పూర్తి చేసుకున్న తరువాత వంద రోజుల పాటైనా కొవిడ్ డ్యూటీలలో ఉండే వారికి ప్రభుత్వోద్యోగాలలో ప్రాధాన్యతలు ఇస్తారని పిఎంఒ తెలిపింది. ఇక కొవిడ్ చికిత్సకు సంబంధించి కొత్త వైద్య విద్యార్థులకు వారి వారి ఫ్యాకుల్టీల నుంచి సరైన విధంగా శిక్షణ దక్కుతుంది. ఫైనల్ ఇయర్ ఎంబిబిఎస్ విద్యార్థులు ఇప్పటి నుంచే కొవిడ్ కేసులకు సంబంధించి టెలీ కన్సల్టెషన్, స్వల్పస్థాయి కొవిడ్ కేసుల విషయంలో స్వయంగా పర్యవేక్షణ వంటివి చేయాల్సి ఉంటుంది.

ఇదంతా కూడా వారి హౌస్‌సర్జన్ ప్రక్రియలో భాగంగా ఉంటుంది. నీట్ పరీక్షలు ఎప్రిల్ 18న జరగాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో వీటిని అంతకు ముందే వాయిదా వేశారు. ఇప్పుడు మరో నాలుగు నెలల వాయిదా నిర్ణయం తీసుకున్నారు. కరోనా కట్టడి దశలో వైద్య విద్యార్థులు, సంబంధిత నర్సు కోర్సులు చేసిన వారిని కొవిడ్ చికిత్సకు పంపించేందుకు తీసుకోవడం వల్ల వైద్య చికిత్స సంబంధింత సేవల విభాగాలకు సిబ్బంది తోడవుతుందని ప్రధాని మోడీ ఆదివారం ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో తెలుసుకున్నారు. దీని మేరకు ఇప్పుడు నీట్ వాయిదా వేసినట్లు పిఎంఒ తెలిపింది.

NEET PG 2021 Exam postponed for 4 Months

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News