Saturday, April 27, 2024

ఉన్మాదులకు గుణపాఠం చెప్పే హీరోయిన్

- Advertisement -
- Advertisement -

సినిమా అంటే వినోదాత్మకంగానే కాదు ప్రయోజనాత్మకంగా కూడా ఉండాలన్న ఆలోచనతో… గర్ల్ సేవ్ గర్ల్ కాన్సెప్ట్ ఆధారంగా రచయిత డా. సదానంద్ శారద ఎస్3 క్రియేషన్స్ పతాకంపై శ్రీమాన్ గుమ్మడవెల్లి దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ’నేనే సరోజ’. శాన్వి మేఘన, కౌశిక్ బాబు జంటగా నటించారు. ఈ చిత్రం టీజర్‌ను ఎమ్మేల్యే ముఠా గోపాల్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో రచయిత, నిర్మాత డా.సదానంద్ శారద, దర్శకులు శ్రీమాన్ గుమ్మడవెల్లి, సంగీత దర్శకులు రమేశ్ ముక్కెర తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకులు శ్రీమాన్ గుమ్మడవెల్లి మాట్లాడుతూ “ఆడపిల్లల మీద దాడి చేసే ఉన్మాదులకు, వివక్షత చూపేవారికి ’ తాగిస్తం కారంచాయ్’ అంటూ గుణపాఠం చెబుతుంది ఈ చిత్రంలోని హీరోయిన్ సరోజ. మంచి కంటెంట్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా కుటుంబ సమేతంగా చూసే చిత్రమిది”అని అన్నారు. రచయిత, నిర్మాత డా సదానంద్ శారద మాట్లాడుతూ “వరంగల్ కోట వంటి ఆహ్లాదకరమైన చారిత్రక ప్రదేశాలు…హృద్యమైన సంగీతం.. ఆలోచనాత్మక సంభాషణలు..శాన్వి మేఘన వీరోచిత పోరాటాలు..ఆర్.యస్.నంద హాస్యం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News