Wednesday, May 8, 2024

యువరాజ్ సింగ్ రికార్డు బద్దలు.. టీ20లో నేపాల్ ప్రపంచ రికార్డు

- Advertisement -
- Advertisement -

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రపంచ రికార్డు బద్దలైంది. నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్ ఐరీ టీ20లో యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టి కొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఆసియా గేమ్స్ లో భాగంగా మంగళవారం మంగోలియా-నేపాల్ మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో దీపేంద్ర సింగ్(50 నాటౌట్) కేవలం 9 బంతుల్లోనే 8 భారీ సిక్సులతో అర్థ శతకం సాధించాడు. దీంతో యురాజ్ సింగ్(12 బంతుల్లో అర్థసెంచరీ) పేరిట ఉన్న అత్యంత ఫాస్టెస్ట్ ఆఫ్ సెంచరీ రికార్డును చెరిపేసి దీపేంద్ర సింగ్ నయా రికార్డు నెలకొల్పాడు.

ఈ మ్యాచ్ లో దీపేంద్ర సింగ్ తోపాటు మరో బ్యాట్స్ మెన్ కుశాల్ మల్ల(137 పరుగులు నాటౌట్, 50 బంతుల్లో) చెలరేగాడు. కుశాల్ 34 బంతుల్లోనే సెంచరీ సాధించి.. అత్యంత తక్కువ బంతుల్లో శతకం సాధించిన బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. దీంతో నేపాల్ జట్టు 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 314 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన మంగోలియా కేవలం 41 పరుగులకే పరిమితమైంది. దీంతో మంగోలియాపై 273 పరుగుల భారీ తేడాతో నేపాల్ రికార్డు విజయం సాధించింది. కాగా, టీ20లో అత్యధిక పరుగులు(314) సాధించిన జట్టుగా కూడా నేపాల్ ప్రపంచ రికార్డు సృష్టించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News