Monday, May 6, 2024

కొత్త పార్లమెంటు భవనం ప్రారంభానికి సిద్ధం

- Advertisement -
- Advertisement -

తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా నెలాఖరులో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం!

న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి తుది మెరుగులు దిద్దడం జరుగుతోందని, ఈ నెలాఖరుకల్లా భవనం ప్రారంభోత్సవానికి సిద్ధం అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు మంగళవారం తెలిపాయి. సివిల్ నిర్మాణాల క్లీనింగ్ పనులు ప్రారంభమ్యాయని, అయితే కొత్త ప్రారంభోత్సవానికి సంబంధించి ప్రభుత్వంనుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని ఆ వర్గాలు తెలిపాయి. రెండేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కొత్త పార్లమెంటు భవన నిర్మాణం ప్రారంభమైన విషయం తెలిసిందే.

దేశ అధికార కేంద్రమైన సెంట్రల్ విస్టా పునర్నిర్మాణంలో భాగంగా పార్లమెంటు కొత్త భవనాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్రపతి భవన్‌నుంచి ఇండియా గేట్ వరకు ఉన్న మూడు కిలోమీటర్ల మారాన్ని తిరిగి అభివృద్ధి చేయడం, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, ప్రధానమంత్రి నివాసం, కార్యాలయం నిర్మాణం, ఉపరాష్ట్రపతి కొత్త ఎన్‌క్లేవ్ నిర్మాణాన్ని సెంట్రల్ పబ్లిక్ వర్క్ విభాగం అమలు చేస్తున్న విషయం తెలిసిందే.‘ ఈ నెలాఖరుకు కొత్త పార్లమెంటు భవనం సిద్ధం కానుంది. అయితే భవనం ప్రారంభోత్సవానికి సంబంధించి ప్రభుత్వంనుంచి ఇంకా ఎలాంటి సమాచారం లేదు’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా మే 30 దరిదాపుల్లో ప్రధాని నరేంద్ర మోడీ కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2014 మే 26న నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు.

పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం తేదీని ఎంపిక చేయడం ప్రభుత్వం ఇష్టమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి గత ఏడాది నవంబర్‌లో చెప్పిన విషయం తెలిసిందే. అధునిక సదుపాయలు కలిగిన కొత్త పార్లమెంటు భవనానికి ప్రధాని నరేంద్ర మోడీ 2020 డిసెంబర్‌లో శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. రూ.970 కోట్ల వ్యయంతో టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ ఈ భవన నిర్మాణాన్ని చేపట్టింది. 64,500 చదరపు మీటర్ల పరిధిలో పాత పార్లమెంటు అంత ఎత్తులో ఈ కొత్త భవనాన్ని నిర్మించారు. ఒకే సారి 1,224 మంది ఎంపీలు ఇందులో కూర్చునే వీలు ఉంది. భారత రాజ్యాంగ వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా విశాలమైన రాజ్యాంగ హాల్, పార్లమెంటు సభ్యుల కోసం లాంజ్, లైబ్రరీ, పలు కమిటీ గదులు, డైనింగ్ హాలు, విశాలమైన పార్కింగ్ స్థలం ఇందులో ఉంటాయి. గత ఏడాది నవంబర్‌కే ఈ భవనం వాస్తవానికి పూర్తి కావలసి ఉండింది. అయితే వివిధ కారణాల వల్ల ఆలస్యమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News