Monday, May 6, 2024

రైతుమెచ్చిన నూతన రెవెన్యూచట్టం

- Advertisement -
- Advertisement -

New Revenue Act favored by Farmers

 

వాడవాడల్లో సంబురాలు
పురవీధుల్లో సిఎంకు పాలాభిషేకం
ర్యాలీలో పాల్గొన్న మహిళా రైతులు

మనతెలంగాణ/హైదరాబాద్: నూతన రెవెన్యూచట్టం రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచింది. భూములను ఎవరూ ఆక్రమించకుండా భద్రతఏర్పడిందనే నమ్మకం పెరిగింది. ఈ చట్టంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు రాజ్యం స్థాపిస్తున్నారనే విశ్వాసం పెరగడంతో నూతన రెవెన్యూ చట్టం రైతు మెచ్చిన చట్టంగా అవతరించింది. ఆనందోత్సవాలతో రైతుకుటుంబాలు పండుగ చేసుకుంటున్నాయి. రైతులు ట్రాక్టర్ల ప్రదర్శన నిర్వహిస్తూ రెవెన్యూచట్టానికి మద్దతు తెలుపుతుంటే రైతుకుటుంబాల్లోని మహిళలు పాదయాత్రలు చేస్తూ సిఎం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభి షేకాలు చేస్తున్న దృశ్యాలు రాష్ట్ర వ్యాప్తంగా చోటుచేసుకున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గంలో కళ్లూరి మండలంలో మంగళవారం వేలాది మంది మహిళా రైతులు మూడు కిలో మీటర్లవరకు పాదయాత్ర నిర్వహించి సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పుల్లయ్య బంజార్ నుంచి కల్లూరు వరకు ప్రదర్శన నిర్వహించారు. శాసనసభ్యుడు సండ్రవెంకట వీరయ్య పాల్వంచరైతులతో కలిసి భారీ ట్రాక్టర్ల ర్యాలీ, ఎండ్ల బండ్ల ర్యాలీ నిర్వహించి రెవెన్యూ చట్టాన్ని స్వాగతించారు.

స్థానిక శివాలయంలో సిఎం కెసిఆర్ పేరుమీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సండ్రవెంకట వీరయ్య వడ్ల గింజలతో కెసిఆర్ చిత్రపటానికి అభిషేకం చేసి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు. జగిత్యాలలో శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్‌కుమార్ నాయకత్వంలో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎస్‌కెఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల నుంచి కొత్త బస్టాండ్ వరకు సుమారు 2వేల ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో జెడ్‌పి చైర్మన్ దావ వసంత సురేష్, జగిత్యాల,రాయికల్ మున్సిపల్ చైర్మన్లు బోగ శ్రావణి,మోర హన్మాండ్లు, ఎంపిపిలు,జెడ్‌పిటిసిలు, సర్పంచ్‌లు టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు. నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ మేడిపల్లి మండల కేంద్రంలో రైతులు ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న జెడ్‌పి వైస్‌చైర్మన్ హరిచరణ్ రావు పాల్గొని కాంగ్రెస్,బిజెపి విధానాలను ఎండగట్టారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి దోనకంటి ఉమాదేవి,టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు అంకం విజయసాగర్, సింగిల్ విండో చైర్మన్ రవీందర్ రావు, వంగ వెంకటేష్. వినోద, దాసు, అదే రాజన్న,సర్పంచ్‌లు అభిలాష్,బాలరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ సుదవేని లతగంగాసాగర్ గౌడ్ పాల్గొన్నారు. అలాగే రైతులు రాయికల్, కుమ్మరిపల్లి, అల్లీపూర్‌ల మీదుగా భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించి సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ట్రాక్టర్ల ర్యాలీలు నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు స్వయంగా ట్రాక్టర్లను నడిపారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు వెంకటేష్ నేతకాని ట్రాక్టర్ నడపగా ఎంఎల్‌ఏలు రైతుల ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ర్యాలీల ముందు వరుసలో తెలంగాణ కళారూపాలు సందడి చేశాయి. ఆట,పాట,నృత్యాలతో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News