Wednesday, May 1, 2024

సొంతింటి కల సాకారానికి త్వరలో కొత్త పథకం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: స్వ్తాంత్య్ర దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట సాక్షిగా ప్రజలపై వరాల జల్లులు కురిపించారు. పట్టణ ప్రాంతాల్లో దిగువ, మధ్య తరగతి ప్రజల సొంతింటి కల సాకారమే లక్షంగా కొత్తపథకాన్నితీసుకువస్తున్నట్లు ప్రకటించారు. బ్యాంకు రుణాలపై రాయితీ ఇచ్చేలా కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. ప్రతి లబ్ధిదారుడికి లక్షల్లో ప్రయోజనం చేకూర్చే ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు.

విశ్వకర్మ యోజన విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని సంప్రదాయ వృత్తి కళాకారులకు చేయూత నందించేందుకు వీలుగా విశ్వకర్మ యోజన పేరుతో కొత్త పథకాన్ని తీసుకు రానున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. వచ్చే నెలనుంచే ఈ పథకాన్ని ప్రారంభించనున్నామని, ఇందుకోసం తొలి విడతగా రూ.13 వేలకోట్లనుంచి రూ.15 వేల కోట్ల దాకా ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.

జన ఔషధి కేంద్రాల పెంపు
చౌకధరల్లో లభించే జనరిక్ మందులు అందరికీ అందుబాటులో ఉండేలా జన ఔసధి కేంద్రాల సంఖ్యను ఇప్పుడున్న 10 వేలనుంచి 25 వేలకు పెంచుతున్నట్లు ప్రధాని ప్రకటించారు.మార్కెట్లో రూ.100కు దొరికే మందులు ఈ జన ఔసధి కేంద్రాల్లో రూ.10 15 లభిస్తున్నట్లు తెలిపారు.
లక్షాధికారులుగా 2 కోట్ల మహిళలు

మహిళా స్వయం సహాయక బృందాల కృషిని ప్రశంసించిన ప్రధాని రెండు కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేయడమే తన కలని చెప్పారు. నేడు స్వయం సహాయక బృందాల్లో 10 కోట్ల మంది మహిళలున్నారని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News