Tuesday, March 19, 2024

కివీస్ 62 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

New zealand score 62 runs for all out

ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కివీస్ 28.1 ఓవర్లలో 62 పరుగులకే ఆలౌటైంది. భారత్ ఇప్పటికే 263 పరుగుల ఆధిక్యంలో ఉంది. కివీస్ బ్యాట్స్‌మెన్లలో అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లలో నీశమ్ (17), టామ్ లాథమ్ (10), డారీ మిచెల్(8), టామ్ బ్లండెల్ (8), హెన్రీ నికోలస్ (7), విల్ యంగ్ (04), రాచిన్ రవీంద్ర(04), రాస్ టేలర్ (1) పరుగులు చేశారు. టిమ్ సౌతీ, విలియమ్ సోమర్ విల్లీ డకౌట్ రూపంలో ఔటయ్యారు. భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు పడగొట్టగా సిరాజ్‌కు మూడు వికెట్లు, అక్షర పటేల్ రెండు వికెట్లు, జయంత్ యాదవ్ ఒక వికెట్ తీశారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 325 పరుగులు చేసింది. ఈ రోజు కివీస్ ఫాలో ఆన్ ఆడాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News