Thursday, May 9, 2024

కాళేశ్వరం విస్తరణ పనులపై ఎన్‌జిటిలో విచారణ..

- Advertisement -
- Advertisement -

NGT to Hearing on Kaleshwaram extension Works

మనతెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం విస్తరణ పనులపై వేసిన పిటిషన్‌పై గురువారం నాడు ఎన్‌జిటిలో విచారణ జరిగింది. ఈక్రమంలో కాళేశ్వరం విస్తరణ పనులకు సంబంధించి పర్యావరణ అనుమతులు లేవని వేములఘాటు రైతులు పిటిషన్ దాఖలు చేయడంతో ఈ మేరకు కాళేశ్వరం విస్తరణ పనులపై ఎన్‌జిటి కేంద్ర జలశక్తిశాఖ అభిప్రాయాన్ని కోరింది. దీంతో జలశక్తి శాఖ రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేస్తామని తెలియజేయడంతో పిటిషన్‌పై నవంబరులో విచారణ చేయాలని ఎన్‌జిటి నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం విస్తరణ పనులపై దాఖలైన పిటిషన్‌ను త్వరగా విచారించాలని పిటిషనర్ల తరపు న్యాయవాది ఎన్‌జిటిని కోరుతూ ప్రభుత్వం రికార్డుస్థాయిలో కాళేశ్వరం పనులు పూర్తి చేసిందని న్యాయవాది పేరొన్నారు. ఇంకా గడువు ఇస్తే పనులు పూర్తయ్యే అవకాశం ఉందని పిటిషనర్ల తరపు న్యాయవాది తెలిపారు. ఈ నేపథ్యంలో పిటిషన్లపై త్వరగా విచారించేందుకు జస్టిస్ ఆదర్శకుమార్ గోయల్ ధర్మాసనం అంగీకారం తెలిపింది. కాళేశ్వరంపై వేసిన అన్ని పిటిషన్లను ఈనెల 7న విచారిస్తామని ఈ సందర్భంగా ఎన్‌జిటి వెల్లడించింది.

NGT to Hearing on Kaleshwaram extension Works

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News