Saturday, May 4, 2024

మంచి మనసుతోనూ ఆకట్టుకుంటోంది

- Advertisement -
- Advertisement -

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన భారీ హిట్ చిత్రం ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌డమ్ తెచ్చుకున్న హాట్ అండ్ యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్. అయితే నిధి పలు చిత్రాల్లో మంచి గ్లామరస్ రోల్స్‌లో కనిపించి ఆకట్టుకుంది. కానీ, నిధి ఒక్క గ్లామర్‌తోనే కాకుండా ఇప్పుడు తన మంచి మనసుతో కూడా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల మూలంగా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం కోసం ‘డిస్ట్రిబ్యూట్ లవ్’ అనే ఒక ఛారిటబుల్ ఆర్గనైజేషన్‌ను ఆమె ప్రారంభించింది. దీని ద్వారా ఈ కష్ట కాలంలో ఇబ్బందులు పడుతున్న వారికి సహకారం అందించనుంది. దీంతో నిధి అగర్వాల్ తీసుకున్న ఈ నిర్ణయానికి సినీ వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక, నిధి ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం ‘హరిహర వీరమల్లు’లో హీరోయిన్‌గా నటిస్తోంది.

Nidhi Agarwal starts Distribute love amid Covid 19 Crisis

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News