Wednesday, May 8, 2024

బ్లాక్ ఫంగస్… రాష్ట్రాలకు 29,250 యాంపోటెరిసిన్‌బి వయల్స్

- Advertisement -
- Advertisement -

అదనంగా 29,250 యాంపోటెరిసిన్‌బి
వయల్స్: కేంద్రమంత్రి సదానందగౌడ

55% black fungus patients had diabetes, says health minister
బెంగళూర్: బ్లాక్ ఫంగస్(మ్యూకర్‌మైకోసిస్) చికిత్స కోసం వినియోగించే 29,250 యాంఫోటెరిసిన్‌బి వయల్స్‌ను రాష్ట్రాలకు అదనంగా కేటాయించామని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి డివి సదానందగౌడ తెలిపారు. దేశంలో ఇప్పటివరకు ఈ వ్యాధి బారిన పడినవారిలో 11,717మందికి చికిత్స అందిస్తున్నారని, ఆయా రాష్ట్రాల్లోని పేషెంట్ల సంఖ్య ఆధారంగానే కేటాయింపుల చేశామని ఆయన తెలిపారు. ఇంతకుముందు మే 24న 19,420 వయల్స్, మే 21న 23,680 వయల్స్‌ను రాష్ట్రాలకు పంపినట్టు గౌడ తెలిపారు. ఈ వ్యాధి బారిన పడిన పేషెంట్లు గుజరాత్‌లో 2859, మహారాష్ట్రలో 2770,ఆంధ్రప్రదేశ్‌లో 768, మధ్యప్రదేశ్‌లో 752, తెలంగాణలో 744, ఉత్తర్‌ప్రదేశ్‌లో 701, కర్నాటకలో 481మంది ఉన్నట్టు గౌడ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News