Monday, April 29, 2024

కోవిడ్ చికిత్స….. ఔషధాలు, సామాగ్రిపై జిఎస్‌టి రాయితీ: నిర్మల

- Advertisement -
- Advertisement -

GST subsidy on drug of Covid- black fungus treatment

ఢిల్లీ: బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే ఔషధాలపై జిఎస్‌టి రాయితీ ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జిఎస్‌టి కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కోవిడ్ చికిత్సకు ఉపయోగించే ఔషధాలు, సామాగ్రిపై జిఎస్‌టి రాయితీలు ఇస్తామన్నారు. కరోనా చికిత్సకు ఉపయోగించే మూడు ఔషధాలపై పన్ను మినహాయింపు ఉంటుందని, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సిఫారసులకు జిఎస్‌టి కౌన్సిల్ ఆమోదం తెలిపిందన్నారు. అంబులెన్స్‌లపై జిఎస్‌టిని 12 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. వ్యాక్సిన్ జిఎస్‌టిని కౌన్సిల్ మార్చలేదని, వ్యాక్సిన్లపై యథాతథంగా ఐదు శాతం జిఎస్‌టి అమలు చేస్తామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఆక్సిజన్ యూనిట్లు, ఉత్పత్తి యంత్రాలపై జిఎస్‌టిని తగ్గించామని,  టెంపరేచర్ చూసే పరికరాలు, స్మశానవాటికల్లో ఉపయోగించే ఎలక్ట్రిక్ యంత్రాల, శానిటైజర్‌పై ఐదు శాతం జిఎస్‌టి తగ్గిందని వెల్లడించారు. సెప్టెంబరు 30 వరకు జిఒఎం సిఫారసులు అమల్లో ఉండనున్నాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News