Saturday, April 27, 2024

పిల్లలకు ముప్పుపై సంకేతాల్లేవ్

- Advertisement -
- Advertisement -

No indication that children will be 'severely affected' in third wave

 

కరోనా మూడోదశ అంచనాలపై జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదు

చిన్నారులపై ప్రభావం చూపించకపోవచ్చు
ప్రజలు భయపడాల్సిన అక్కర్లేదు
ఫంగస్ రంగులతో అయోమయం వద్దు
శరీరభాగాలను బట్టే రంగు మారుతుంది – ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా

న్యూఢిల్లీ: కొవిడ్19 థర్డ్ వేవ్ చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అటువంటి అంచనాలను ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఖండించిందని కూడా ఆరోగ్యశాఖ గుర్తు చేసింది. పిల్లలకు అధిక ము ప్పు ఉంటుందంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవాల ఆధారంగా చె బుతున్నది కాదని, కరోనా వైరస్ చిన్న పిల్లలపై ప్రభావం చూపించక పో వచ్చని ప్రజలు భయపడవద్దని వివరణ ఇచ్చింది. బ్లాక్ ఫంగస్, ఎల్లో ఫ ంగస్ అనే పదాల వల్ల అయోమ యం నెలకొంటున్నదని హితవు పలికింది. దీనిపై ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా వివరణ ఇచ్చారు. శరీరంలోని వివిధ భాగాలపై చేరినపుడు ఫంగస్ రంగులో మార్పు ఉం టుందని గులేరియా తెలిపారు. ఒకే ఫంగస్ వివిధ శరీర భాగాల్లో చేరినపుడు రంగు మారడాన్ని వేర్వేరు ఫంగస్‌లుగా చెప్పడం వల్ల అయోమయానికి గురవుతున్నారని గులేరి యా స్పష్టం చేశారు. ఇదేమీ అంటువ్యాధి కాదని కూడా ఆయన తెలిపారు.

రోగనిరోధకశక్తి తక్కువగా ఉ న్నవారిలో మ్యూకర్‌మైకాసిస్, క్యాండిడా, ఆస్పర్‌జిల్లోసిస్‌లాంటి ఫంగస్ సైనస్, ముక్కు, కళ్ల చుట్టూ ఉన్న ఎముకలు, అరుదుగా ఊపిరితిత్తుల్లో చేరుతాయని, మెదడులోకి కూడా ప్రవేశిస్తాయని ఆరోగ్యశాఖ పేర్కొన్నది. మొదటి, రెండో వేవ్‌ల్లో చిన్నారుల్లో కొవిడ్ కేసులు చాలా తక్కువేనని, వారిలోనూ స్వల్ప లక్షణాలే కనిపించాయని గులేరియా తెలిపారు. చిన్నారుల్లో స్మార్ట్‌ఫోన్లకు బానిసలుగా మారడం, చదువులో వెనకబాటుతనం వల్ల మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన వివరించారు. కొవిడ్ వల్ల చిన్నారులకు హాని జరుగుతుందన్న ఆందోళన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కొవిడ్ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు కొనసాగకపోవడం వల్ల కూడా ఆందోళన నెలకొన్నదని ఆయన తెలిపారు. చిన్నారుల్లో కొవిడ్ ప్రభావం తక్కువగా ఉండటానికి కారణంగా చెబుతున్న ఓ సూత్రీకరణను గులేరియా గుర్తు చేశారు. ఏసిఇ2 ప్రోటీన్ అధికంగా ఉన్నవారిలోకి కరోనా తేలిగ్గా ప్రవేశిస్తుందన్నది ఆ సూత్రీకరణ. పెద్దలతో పోలిస్తే చిన్నారుల్లో ఆ ప్రోటీన్ తక్కువగా ఉంటుందని, అందుకే కొవిడ్ ప్రభావం వారిపై తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

12 వారాలు దాటితే కొవిడ్ సిండ్రోమ్
కొవిడ్19 లక్షణాలు నాలుగు వారాలకుపైగా ఉంటే కొవిడ్ అనంతర తీవ్రతగా, 12 వారాలకుపైగా ఉంటే కొవిడ్ అనంతర సిండ్రోమ్‌గా చెబుతారని గులేరియా తెలిపారు. గత 17 రోజులుగా దేశంలో నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో తగ్గుదల కనిపిస్తోందని ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. గత రెండు వారాలుగా వారాంతపు కొవిడ్ పాజిటివిటీ రేట్‌లో తగ్గుదల నమోదైందని ఆయన పేర్కొన్నారు. గత 15 వారాల్లో కొవిడ్ పరీక్షల్ని 2.6 రెట్లు పెంచామని కూడా ఆయన అన్నారు. ఇప్పటివరకు 45 ఏళ్లు పైబడినవారికి 14.56 కోట్ల డోసులు, 1844 ఏజ్‌గ్రూప్ వారికి 1.06 డోసుల టీకాలను పంపిణీ చేసినట్టు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News