Wednesday, May 1, 2024

 నిండు గర్భిణికి ఎంఎల్‌సి కవిత అండ

- Advertisement -
- Advertisement -

TRS MLC Kavitha Comments On Cancer
మనతెలంగాణ/హైదరాబాద్: ఎంఎల్‌సి కల్వ కుంట్ల కవిత చొరవతో ఓ తల్లి ప్రసవ వేదన తీరిం ది. ఏ ఆటంకం లేకుండా ఓ చిట్టి ప్రాణం ఈ ప్ర పంచంలోకి వచ్చింది. కోస్గికి చెందిన జ్యోతిబాయి తొమ్మిది నెలల గర్భవతి. అయితే డెలివరీ డేట్ కంటే ముందే నొప్పులు రావడంతో పాటు రక్తం త క్కువగా ఉండడంతో అర్జెంటుగా ఆపరేషన్ చే యాలని డాక్టర్లు సూచించారు. క్యాబ్ డ్రైవర్ అయి న జ్యోతిబాయి భర్తకు ఆ ఆపరేషన్ చేయించడం ఆర్థికంగా భారంగా మారింది. దీంతో జ్యోతిబా యి మరిది ట్విట్టర్‌లో సహాయం కోసం అభ్యర్థిం చాడు. మనసున్న కొంతమంది మంచి మనుషులు స్పందించారు. కొంత మొత్తం జమైంది. కానీ ఆప రేషన్ ఖర్చుకు అది ఎంత మాత్రం సరి పోలేదు. మరోవైపు జ్యోతి బాయి ఆరోగ్య పరిస్థితి విషమం గా మారడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెం దారు.

అయితే జ్యోతిబాయి గురించి ఎంఎల్‌సి కవితకు తెలియడంతో ఆ కుటుంబానికి ఓదార్పు దక్కింది. జ్యోతి బాయి ఆపరేషన్ ఖర్చును భరిస్తా నని ఎంఎల్‌సి కవిత హామీ ఇచ్చారు. కవిత చొరవ తో జ్యోతి బాయికి క్లిష్టమైన ఆపరేషన్ కావడంతో సోమవారం జ్యోతిబాయి పండండి బిడ్డకు జన్మని చ్చింది. తల్లిబిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఈ వి షయాన్ని ఎంఎల్‌సి కవిత ట్విట్టర్‌లో తెలియజేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎంఎల్‌సి కవిత చేసిన సహాయంతో జ్యోతిబాయి భర్త, మరిది చ లించిపోయారు. కవిత స్పూర్తితో తాము కూడా ఆపదలో ఉన్నవారికి చేతనైనంత సహాయం చేస్తా మని ప్రకటించారు. క్యాబ్ డ్రైవర్‌లు అయిన వారు ఇక నుంచి తాము గర్భిణులను ఉచితంగా ఆస్ప త్రులకు తీసుకుపోతామని ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News