Monday, April 29, 2024

హైవే కిల్లర్ గ్యాంగ్‌కు ఉరిశిక్ష

- Advertisement -
- Advertisement -

12 sentenced to death in highway killer Munna gang case

ప్రధాన నిందితుడు మున్నాతో పాటు మరో 11మంది నిందితులకు శిక్ష ఖరారు చేసిన ఒంగోలు జిల్లా కోర్టు
ఎపిలో 13ఏళ్ల కిందట రహదారులపై లారీ డ్రైవర్లు, క్లీనర్లను హతమార్చిన గ్యాంగ్

ఈ కేసులో ముగ్గురిని రెండు సార్లు ఉరితీయాలని ఆదేశాలు

మనతెలంగాణ/ఆంధ్రప్రదేశ్‌: రాష్ట్రంలోని హైవే కిల్లర్ గ్యాంగ్ ప్రధాన నిందితుడు మున్నాతో పాటు మరో 11 మందికి ఒంగోలు జిల్లా కోర్టు సోమవారం నాడు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. హైవేలలో వరుస దారుణ హత్యలకు, దోపిడీలకు పాల్పడిన మున్నా గ్యాంగ్ 13 ఏళ్ల కిందట హైవేపై లారీ డ్రైవర్, క్లీనర్‌ను దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. దాదాపు 13 ఏళ్ల పాటు సాగిన ఈ కేసు విచారణలో ఎట్టకేలకు 12 మందికి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కాగా 12 దోషులలో వీరిలో ముగ్గురిని రెండుసార్లు ఉరి తీయాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కేసులోని నిందితులు లారీ డ్రైవర్, క్లీనర్‌లను దారుణంగా హత్య చేశారని తేలడంతో ప్రధాన నిందితుడు మున్నాతో పాటు మరో 11 మందికి న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది.

2008లో లారీ డ్రైవర్లు, క్లీనర్లను దారుణంగా హతమార్చి వాగు వద్ద హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ పూడ్చి పెట్టిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. దీనికి సంబంధించి 4 కేసుల్లో 18 మందిపై నేరం రుజువైంది. పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్ నుంచి ఇనుప రాడ్ల లోడ్‌తో తమిళనాడులోని కల్పకంకు బయలుదేరిన లారీతోపాటు డ్రైవర్, క్లీనర్ అదృశ్యమయ్యారు. దీంతో 2008 అక్టోబర్ 17న లారీ యజమాని వీరప్పన్ కుప్పుస్వామి ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పాత ఇనుము వ్యాపారులపై ప్రత్యేక నిఘా పెట్టారు. సయ్యద్ అబ్దుల్ సమద్ అలియాస్ మున్నా కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 20కి పైగా సిమ్ కార్డులు మార్చి దేశం వదిలి పారిపోయేందుకు ప్రయత్నించిన మున్నాను కర్ణాటకలోని అరెస్ట్ చేశారు. ఎట్టకేలకు నిందితులకు ఉరి శిక్ష విధిస్తు ఒంగోలు న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

12 sentenced to death in highway killer Munna gang case

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News