Wednesday, May 1, 2024

అమ్మాయిలు నో చెబితే ఎవరూ ఏం చేయలేరు

- Advertisement -
- Advertisement -

No one can do anything if girls say no

 

సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనేది సర్వ సాధారణం అని చాలా మంది అంటూ ఉంటారు. ఆఫర్లు రావాలంటే కొన్ని సార్లు ఆత్మాభిమానం పక్కన పెట్టాల్సిందే అంటూ బాహాటంగా కొందరు స్టార్ హీరోయిన్స్ కూడా గతంలో వ్యాఖ్యలు చేశారు. తాజాగా కాస్టింగ్ కౌచ్‌పై ‘బిగ్ బాస్’ బ్యూటీ నందిని రాయ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. కాస్టింగ్ కౌచ్‌కు పూర్తి కారణం అమ్మాయిలే అంటూ ఆశ్చర్యకరంగా కామెంట్స్ చేసింది. తాజాగా నందిని రాయ్ ఈ విషయమై మాట్లాడుతూ “కాస్టింగ్ కౌచ్ కు ఎవరైనా ప్రయత్నించిన సమయంలో అమ్మాయిలు నో అంటే ఆ విషయం అక్కడితో ముగుస్తుంది.

అమ్మాయిలు నో చెబితే ఎవరు ఏం చేయలేరు. ఇండస్ట్రీలో ఒకరిని ఒకరు బలవంత పెట్టే పరిస్థితి అస్సలు ఉండదు అనేది నా అభిప్రాయం. కాస్టింగ్ కౌచ్ అనేది పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి చెందినదిగా అందరు అనుకుంటున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే ఇది అన్ని రంగాలకు విస్తరించింది. నాకు ఉన్న ఐటి ఫ్రెండ్స్ ద్వారా తెలిసిన విషయం ఏంటి అంటే కాస్టింగ్ కౌచ్ విషయంలో సినిమా పరిశ్రమ చాలా బెటర్ అని. అన్ని రంగాల్లో కూడా అమ్మాయిలను వాడేసుకోవాలని కొందరు ప్రయత్నిస్తారు. ఆ సమయంలో అమ్మాయిలు నో చెబితే ఎవరు అంతకు మించి మరో అడుగు వేయరు”అని పేర్కొంది. ఇక నందిని రాయ్ సోషల్ మీడియాలో చేసిన ఈ వ్యాఖ్యలను చాలా మంది సమర్ధిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News