Saturday, April 27, 2024

భారత్‌లో ఒక్క ఒమిక్రాన్ కేసూ లేదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించి దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. అయినప్పటికీ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్న ప్రభుత్వం విదేశీ ప్రయాణికులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని తెలిపింది. మంగళవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ‘ఇప్పటికే ఈ వేరియంట్ 14 దేశాలకు వ్యాపించింది. దేశంలో మాత్రం ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. వైరస్ నిర్మూలన, వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు జీనోమ్ సీక్వెన్సింగ్ కూడా చేపడుతున్నాం’ అని మన్‌సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. వైరస్ లక్షణాలున్న అనుమానిత కేసులనూ పరీక్షిస్తున్నామని, పాజిటివ్ వచ్చినట్లయితే వాటిని తక్షణమే జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలకు పంపిస్తున్నామని వెల్లడించారు. గత అనుభవాలనుంచి ఎంతో నేర్చుకున్నామన్న ఆయన దేశవ్యాప్తంగా అవసరమైన వనరులు, ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న ధీమాను మాండవీయ వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుతం కొవిడ్ పరిస్థితి అదుపులో ఉందని చెప్పి మంత్రి అయితే ఈ వ్యాధి పూర్తిగా అంతం కాలేదని, కొవిడ్‌కు సంబంధించి తీసుకోవలసిన అన్ని మందస్తు జాగ్రత్తలు కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

No one single Omicron variant in India: Centre

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News