Monday, April 29, 2024

పోస్టల్ బ్యాలెట్ ఇప్పటికింతే

- Advertisement -
- Advertisement -

No postal ballot pilot planned for non-Gulf expatriate Indians

 

గల్ఫేతరుల కిచ్చే ఆలోచనలేదు

న్యూఢిల్లీ : గల్ఫేతర ప్రవాస భారతీయులకు పోస్టల్ బ్యాలెట్ ప్రవేశపెట్టే ఆలోచన లేదని ఎన్నికల సంఘం తెలిపింది. దీనికి సంబంధించి పార్లమెంట్ సభ్యులు లేవనెత్తిన సందేహాలకు కమిషన్ సమాధానం ఇచ్చుకుంది. ఇటువంటి ప్రతిపాదన ఏదీ లేదని తేల్చిచెప్పింది. గల్ఫ్ దేశాలు కాకుండా నిర్ణీత కొన్ని దేశాలలోని భారతీయులకు ఓటు వేసుకునే అవకాశం కల్పిస్తారని ఇటీవల పత్రికలలో వార్తలు వచ్చాయి. అయితే ఇవి నిరాధార వార్తలేనని ఎన్నికల సంఘం తెలిపింది. ఇటువంటి అంశాలపై ముందుగా విదేశాంగ మంత్రిత్వశాఖతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. పలు దేశాలలో ఉన్న భారతీయులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. దీనికి సంబంధించి తుది నిర్ణయం న్యాయ మంత్రిత్వ శాఖ తీసుకోవాలి. అయితే ఇటువంటి అవకాశం కొన్ని దేశాలలోని ఎన్నారైలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలోని వారికి వర్తింప చేస్తారని ఈ విషయంపై అవగావహన ఉన్న వారు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News