Monday, April 29, 2024

అంతరాష్ట్ర ఎటిఎం దొంగల ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Interstate ATM Robber Gang Arrested in Hyderabad

హైదరాబాద్: వరసగా ఎటిఎంలలో చోరీలు చేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి లారీ, టాటా సుమో, పల్సర్ బైక్, గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ కట్టర్, నగదు రూ.73,060 స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజస్థాన్, అల్వార్ జిల్లా, తిజారా తాలూక, బిలాస్‌పూర్ గ్రామానికి చెందిన వారిస్ ఖాన్, రాంగూడకు చెందిన ఎండి మోహిన్ ఖాన్ కూలీ పనిచేస్తున్నాడు. హర్యానా, పాల్‌టాక్ జిల్లా, హోడల్ తాలూక, సరాయి గ్రామానికి చెందిన వాహిద్ ఖాన్, మునాజీర్ అలియాస్ మున్నా, ఉత్తర్‌ప్రదేశ్, మథురా జిల్లా, చాతా తాలూక, ఉట్‌వాడ్ గ్రామానికి చెందిన ముఫీద్ ఖాన్, హర్యానాకు చెందిన ఎండి జహీర్ ఖాన్, ఖాదర్ ఖాన్, అజ్రూ, హరీస్, ఇర్‌ఫాన్ కలిసి ముఠాగా ఏర్పడి ఎటిఎంలను దోచుకుంటున్నారు. ఖాదర్ ఖాన్, ఆజూర్, హరీస్, ఇర్ఫాన్ పరారీలో ఉన్నారు.

హర్యానా, రాజస్థాన్, యూపి రాష్ట్రాలకు చెందిన నిందితులు అలారం సిస్టం, ఇనుముతోచేసిన ఎటిఎంలు, సెక్యూరిటీ గార్డు లేని ఎటిఎంలను టార్గెట్ చేసుకుని దోచుకుంటున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని షాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురంలో రెండు, అబ్దుల్లాపూర్‌మెట్, తమిళనాడులోని శ్రీపెరంబుదూర్, ఎపిలోని ఓర్వకల్, కర్నూల్, యాదమర్రి, తవనంపల్లి, బీహార్ ఔరంగాబాద్, మధ్యప్రదేశ్‌లోని జవాడ్, లోని ఎటిఎంలలో చోరీలు చేశారు. నిందితులు బైక్, కారు, లారీలో వచ్చి ఎటిఎం వద్దకు వచ్చి సిసి కెమెరాలకు కలర్ రాస్తున్నారు. తర్వాత ఎటిఎంను గ్యాస్ కట్టర్‌తో మిషన్ భాగాలను తొలగించి మిషన్‌లో ఉన్న డబ్బులను తీసుకుని పారిపోతున్నారు. దొంగిలించిన వాహనాలను శివారు ప్రాంతాలకు వెళ్లిన తర్వాత వదిలేసి పారిపోతున్నారు. వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ ఎటిఎంలలో చోరీలు చేస్తున్నారు. కొన్ని సమయాల్లో చోరీ చేసే రాష్ట్రాలకు చెందిన వారి సాయం తీసుకుని ఎటిఎంలలో చోరీలు చేస్తున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా చోరీలు చేశారు. రాజస్థాన్‌కు చెందిన వారీస్ ఖాన్, మోనిన్ ఖాన్ ఎటిఎం కట్టింగ్‌లో నిపుణులు.

వాహీద్ ఖాన్ లారీ యజమాని, ముఫీద్ లారీ డ్రైవర్, మునాజీర్ అలియాస్ మున్నా నగరంలోని ఆటోనగర్‌లోని ట్రాన్స్‌ఫోర్ట్ ఆఫీస్‌లో పని చేస్తున్నాడు. వాహిద్ ఖాన్‌కు కజిన్ బ్రదర్ అవుతాడు. వాహిద్ ఖాన్, వారిస్ ఖాన్, ఖాదర్ ఖాన్ ఎటిఎం పరిసరాల్లో రెక్కీ నిర్వహిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు తమిళనాడు, నాగపూర్, మధ్యప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పోలీసులు నిందితులను పట్టుకోవడంలో సాయం చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్లు శ్రీధర్ రెడ్డి, రవికుమార్, పార్థసారథి, వెంకటేశ్వర్లు, మహేష్, నవీన్ రెడ్డి, ఎవి రంగా, స్వామి, ఎస్సైలు జానకి రామ్ రెడ్డి, ఎండి మసిఉద్దిన్ తదితరులు నిందితులను పట్టుకున్నారు.

వాహనాల చోరీ….

వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నిందితులు స్థానికంగా ఉన్న టాటా సుమో ఎపి09పిబి1000 వనస్థలిపురంలో పార్కింగ్ చేసిన దానిని చోరీ చేశారు. తర్వాత లారీ బాడీవర్క్ చేసే ప్రాంతానికి వెళ్లి గ్యాస్ సిలిండర్, కట్టర్‌ను చోరీ చేసి తీసుకుని వెళ్లారు. అక్కడి నుంచి టాటా ఇండి క్యాష్ ఎటిఎం సెంటర్‌కు వెళ్లి అక్కడ చోరీ చేసి సిలిండర్ గ్యాస్ కట్టర్‌ను వదిలేసి వెళ్లారు.

Interstate ATM Robber Gang Arrested in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News