Monday, May 6, 2024

18-44 ఏజ్‌గ్రూప్ వారికి టీకా కేంద్రాల్లో నమోదుకు వీలు

- Advertisement -
- Advertisement -

On-site registration for vaccination for 18-44 years age group

ఆన్‌-సైట్ రిజిస్ట్రేషన్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ: 18-44 ఏజ్ గ్రూప్ వారిలో స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యం లేనివారికి కేంద్ర ప్రభుత్వం నుంచి శుభవార్త. ఈ ఏజ్ గ్రూప్ వారు ఇక ప్రభుత్వ కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలకు(సివిసిలకు) వెళ్లి కోవిన్ పోర్టల్‌లో ఆన్‌సైట్ రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వీలు కల్పించింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకొని అపాయింట్‌మెంట్ రోజున కొందరు రాకపోవడం వల్ల టీకాలు వృథా అవుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వృథాను అరికట్టేందుకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నామని పేర్కొన్నది.

అయితే,ఆన్‌సైట్ రిజిస్ట్రేషన్లకు ప్రైవేట్ సివిసిలకు అవకాశమివ్వలేదు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆన్‌సైట్ రిజిస్ట్రేషన్లపై నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇస్తున్నట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. వాక్ ఇన్ లేదా ఆన్‌సైట్ రిజిస్ట్రేషన్ విధానం ఇప్పటికే 45 ఏళ్లు పైబడినవారికి కల్పించారు. వీరికి కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా టీకాలు పంపిణీ చేస్తున్నది. కాగా, 1844 ఏజ్‌గ్రూప్ వారి వ్యాక్సినేషన్ బాధ్యతను రాష్ట్రాలకు అప్పజెప్పింది. ఇప్పటి వరకూ ఈ ఏజ్‌గ్రూప్ వారికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు మాత్రమే వీలుండేది. మరోవైపు టీకాలను సేకరించి ఇచ్చే అవకాశాన్ని ప్రైవేట్ ఆస్పత్రులకు కూడా ఇప్పటికే కల్పించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News