Saturday, April 27, 2024

ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉద్యోగాలు ఇచ్చాం

- Advertisement -
- Advertisement -

పూర్వపు ప్రభుత్వంతో పోలిస్తే బిజెపి హయామే మేలు
గత ప్రభుత్వంలో నియామకాల పూర్తికి అసాధారణ ‘జాప్యం’
రోజ్‌గార్ మేలా కార్యక్రమంలో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : గడచిన పది సంవత్సరాలలో పూర్వపు ప్రభుత్వం పని తీరుతో పోలిస్తే తన ప్రభుత్వం ఒకటిన్నర రెట్లు ఉద్యోగాలు ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం వెల్లడించారు. ఢిల్లీలో రోజ్‌గార్ మేలా కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లక్ష మందికి పైగా యువజనులకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం నియామక పత్రాలను ప్రధాని మోడీ అందజేస్తూ, నియామక ప్రక్రియల పరిపూర్తికి అసాధారణంగా ‘దీర్ఘ వ్యవధి’ తీసుకున్నందుకు పూర్వపు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. అది లంచగొండితనానికి దారి తీసిందని ఆయన విమర్శించారు.

తన ప్రభుత్వం పారదర్శకత తీసుకువచ్చిందని, నియామకాలు నిర్ణీత వ్యవధిలో జరిగే విధంగా కృషి చేస్తున్నదని మోడీ తెలిపారు. తమ అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయని, కఠిన శ్రమ, ప్రతిభ ద్వారా ప్రభుత్వ వ్యవస్థలో తమకు ఒక చోటు చూసుకోగలమని యువజనులు ఇప్పుడు విశ్వసిస్తున్నారని ఆయన చెప్పారు. ఒక కోటి గృహాల కోసం ఇళ్లపైన సౌర శక్తి ఏర్పాటు పథకం గాని, మౌలిక వసతుల కల్పనలో భారీ స్థాయి పెట్టుబడి గాని తన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పెక్కు ఉద్యోగావకాశాల సృష్టి జరుగుతున్నదని ప్రధాని తెలియజేశారు. లక్షా పాతిక వేల పైచిలుకు స్టార్టప్‌లతో ఈ రంగంలో భారత్ మూడవ అతిపెద్ద ఎకోసిస్టమ్ కలిగి ఉన్నదని, చిన్న నగరాలలో సైతం యువత కొత్త సంస్థలు నెలకొల్పుతున్నారని మోడీ వెల్లడించారు. అది లక్షలాది ఉద్యోగాలు సృష్టిస్తున్నదని ఆయన తెలిపారు.

ప్రయాణికులకు సౌకర్యం, సుఖమయ ప్రయాణాన్ని పెంచేందుకు వందే భారత్‌లో మాదిరి నలభై వేల ఆధునిక బోగీలను తయారు చేయనున్నట్లు, సాధారణ రైళ్లలో ప్రవేశపెట్టనున్నట్లు మోడీ చెప్పారు. పూర్వపు ప్రభుత్వం రైల్వేలపై తగినంత శ్రద్ధ చూపలేదని మోడీ ఆరోపిస్తూ, మొత్తం రైల్వే రంగం ఇప్పుడు పరివర్వన చెందుతున్నదని తెలిపారు. తన ప్రభుత్వం సార్టప్‌లకు పన్ను రిబేట్‌లు విస్తరించిందని ప్రధాని వెల్లడించారు. పరిశోధన, సృజనాత్మకత కోసం లక్ష రూపాయల నిధి ఏర్పాటు చేసినట్లు మోడీ తెలిపారు. ప్రధాని మోడీ ఈ సందర్భంగా ఢిల్లీలో సమీకృత సముదాయం ‘కర్మయోగి భవన్’ మొదటి దశకు శంకుస్థాపన కూడా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News