Saturday, April 27, 2024

బైక్ ను ఢీకొట్టిన డంపింగ్ లారీ: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

Young man died in road accident at Hyderabad

హైదరాబాద్: డంపింగ్ లారీ బైక్‌ను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందిన సంఘటన మేడ్చల్ జిల్లా కీసర సమీపంలో అహ్మద్‌గూడ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… డంపింగ్ లారీ అదుపు తప్పి బైక్‌ను ఢీకొట్టడంతో ఒకరు దుర్మరణం చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. హిమాయత్ సాగర్ లోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కోళ్ల వ్యాన్ బోల్తాపడడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కోళ్ల లోడు శంషాబాద్ నుంచి రాజేంద్రనగర్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News