Monday, April 29, 2024

నచ్చిన కథలకు మాత్రమే ఓకే

- Advertisement -
- Advertisement -

Only OK for favorite stories:Radhika apte

 

బాలీవుడ్ హాట్ బ్యూటీ రాధికా ఆప్టే బిగ్ స్క్రీన్‌పై కంటే స్మాల్ స్క్రీన్‌పైనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ, మరాఠీలతో పాటు ఇంగ్లీష్ భాషలో కూడా నటించిన ఆమె డిజిటల్ వరల్డ్‌లో సత్తా చాటుతోంది. తెలుగులో రక్తచరిత్ర, ధోని, రక్తచరిత్ర 2, లెజెండ్, లయన్, కబాలి వంటి సినిమాల్లో నటించి ఇక్కడి ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఒరిజినల్ సినిమాలు, – వెబ్ సిరీస్‌లతో బిజీగా మారింది. ఈ క్రమంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ వారు రాధికా ఆప్టేను ‘క్వీన్ ఆఫ్ ఓటీటీ’గా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ “కరోనా లాక్‌డౌన్ సమయంలో నేను ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకున్నాను. ప్రస్తుతం నచ్చిన కథలకు మాత్రమే ఓకే చెబుతున్నాను. నచ్చకపోతే ఖచ్చితంగా ‘నో’ చెప్పాలని నిర్ణయించుకున్నాను”అని పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News