Sunday, May 5, 2024

ఓటేయకపోతే వ్యాక్సిన్ ఇవ్వరా..?

- Advertisement -
- Advertisement -

Opposition slams BJP's free Covid-19 vaccine

న్యూఢిల్లీ : తమను గెలిపిస్తే అందరికీ ఉచిత కరోనా వ్యాక్సిన్ ఇస్తామనే బిజెపి వాగ్దానం వివాదాస్పదం అయింది. అత్యంత కీలకమైన వ్యాక్సిన్‌తో అధికార పార్టీ రాజకీయాలకు దిగిందని, ఎన్నికలలో ఓట్లకు వ్యాక్సిన్‌తో గాలమేసిందని ఇది హాస్యాస్పదం అని ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. బిజెపికి ఓటువేయని వారికి వ్యాక్సిన్ ఇచ్చేది లేదనేది బిజెపి ఉద్ధేశమా అని ప్రశ్నించారు. అసలు ఈ వ్యాక్సిన్‌ను బిజెపి పార్టీ నిధుల నుంచి ఇస్తుందా? లేక ప్రభుత్వ ఖజానానుంచి బీహార్ ప్రజలకు ఇచ్చి ఇతర ప్రజలను వారి ఖర్మకు వదిలేస్తుందా? అని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా నిలదీశారు. ఓట్లకు ఇటువంటి కీలకమైన వ్యాక్సిన్‌కు ముడిపెట్టడం సిగ్గుచేటైన విషయం అని కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ మండిపడ్డారు. అయితే ప్రతిపక్షాల వాదన అనుచితంగా ఉందని బిజెపి కొట్టిపారేసింది. ఆరోగ్య విషయాలు రాష్ట్రాల పరిధిలోకి వస్తాయని, రాష్ట్రాల స్థాయిలో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తారని తెలిపింది.

Opposition slams BJP’s free Covid-19 vaccine

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News