Monday, May 6, 2024

జిల్లాలో పండ్ల తోటలను ప్రోత్సహించాలి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ ప్రతినిధి : పండ్ల తోటల సాగుకు ప్రభుత్వ ప్రొత్సాహకం అందిస్తుందని, జులై 31 నాటికి జిల్లాలో 2565 ఎకరాల్లో పండ్ల తోటల సాగుకు రైతుల వివరాలను గుర్తించి ఉపాధి హామీ పథకంలో అ-ప్లోడ్ చేయాలని కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఎంపిడిఓలను ఆదేశించారు. శనివారం నాగర్‌కర్నూల్ సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉపాధి హామీ ద్వారా పండ్ల తోట ల సాగుకు తీసుకోవాల్సిన చర్యలు, వర్షాకాలం సీ జన్ వ్యాధులపై అదనపు కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్, ఎంపిడిఓ లు, ఎంపిఓలతో సమావేశం నిర్వహించారు. పండ్ల తోటల సాగుకు సంబంధించి ఉపాధి హామీ పథకం కింద ఉద్యానవన శాఖతో కలిపి చేపట్టే చర్యలను వివరిస్తూ రూపొందించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను అధికారులు ప్రదర్శించారు.

ఈ సందర్భ ంగా కలెక్టర్ మాట్లాడుతూ పండ్ల తోటల సాగు ప్రో త్సహించి, దానికి అవసరమైన పెట్టుబడిని రైతుల కు సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందులో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో 2565 ఎకరాలలో పండ్ల తోటల సాగు లక్షాన్ని ప్రభుత్వం నిర్దేశించడం జరిగిందని తెలిపారు. 5 ఎకరాలలోపు భూమి, ఉపాధి హామి పథకం జాబ్ కార్డు ఉన్న ఎస్సి, ఎస్టి, సన్న, చిన్నకారు రైతులను లబ్ధిదారులుగా ఎంపిక చేయడానికి అర్హులని, వీ రికి సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కల్పించడం తో పాటు పండ్ల తోటల పెంపకానికి అవసరమైన పెట్టుబడిని ప్రభుత్వం సమకూరుస్తుందని, ఇందుకోసం ఉపాధి హామి పథకం, పిఎం కెవైసి పథకాల ను వినయోగించడం జరుగుతుందని తెలిపారు. ఉ

ద్యాన వన శాఖ పంటల కింద నాగర్‌కర్నూల్ జిల్లా లో ఇప్పటికే 15వేల 197 మంది రైతులు 35 వేల 975 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారని అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో పండ్ల తో టల సాగు కింద మామిడి, నిమ్మ, నారింజ, జామ, సీతాఫలం, సపోట, మునగ, డ్రాగన్, దానిమ్మ, కొ బ్బరి ప్లాంటేషన్ కింద ఐదు ఎకరాల రైతులను ఎం పిక చేయాల్సి ఉంటుందని తెలిపారు. జులై 31 వ రకు రైతుల వివరాలను ఉపాధి హామి పథకంలో అప్లోడ్ చేయాలని ఎంపిడిఓలను కలెక్టర్ ఆదేశించారు. వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, డిఆర్‌డిఏ అధికారులు సంయుక్తంగా పనిచేయాలని సూచించారు.

పండ్ల తోటల సాగు కింద ఎంపికైన రైతుల కు సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని, ఎస్సి, ఎస్టి రైతులకు వంద శాతం, చిన్న, సన్నకారు రైతులకు 90శాతం సబ్సిడితో డ్రి ప్ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. రైతు లు అవసరమైన పండ్ల మొక్కలను రిజిస్ట్రేషన్ పొం దిన ప్రైవేట్ నర్సరీలు, డిపార్టెంట్ నర్సరీల నుంచి కొనుగోలు చేయవచ్చని, పండ్ల మొక్కలకు సబ్సిడి అమౌంట్ రైతులకు బిల్లు సమర్పించిన వెంటనే అ ందించడం జరుగుతుందని తెలిపారు. అదనపు క లెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఎంపిడిఓలు ప్ర తిరోజు తమ మండల పరిధిలోని గ్రామాలను సం దర్శించాలని, తప్పనిసరిగా హరితహారంలో నిర్దేశించిన లక్షాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. 461 గ్రామ పంచాయతీల్లో క్రీడా ప్రాంగణాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఇంకా 78 క్రీడా ప్రాంగణాలు ఎందుకు పూర్తి చే యలేదు, వివరాలను అడిగి తెలుసుకున్నారు. రా నున్న వారం రోజుల్లో పనులు ప్రారంభించి పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. వర్షాకాలం కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి గ్రా మంలో ప్రతిరోజు ఉదయం 7 గంటలకే పారిశు ద్ధ కార్మిక్రమాలను నిర్వహించాలని ఆదేశించా రు. ఫాగింగ్ కార్యక్రమాలతో త్రాగునీటి ట్యాంకులను శుభ్రం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్ రావు, డిఆర్‌డిఓ నర్సింగ్ రావు, డిపిఓ కృష్ణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, అడిషనల్ డిఆర్‌డిఓ రాజేశ్వరి, డిఎల్‌పిఓలు రామ్మోహన్ రావు, పండరినాథ్, ఎంపిడిఓలు, ఎంపిఓలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News