Saturday, April 27, 2024

ఫీవర్‌కు విష జ్వరాల రోగుల తాకిడి

- Advertisement -
- Advertisement -

outbreak in patients in fever hospital

హైదరాబాద్: నగరంలో ఇటీవల కురిసిన వానలకు ముంపు ప్రాంతాలు జలమయంగా మారడంతో సీజనల్ వ్యాధులు విజృంభణ చేయడంతో ప్రజలు భయాందోళనతో కాలం వెల్లదీస్తున్నారు. ప్రభుత్వం ఆరోగ్య శిబిరాలు నిర్వహించిన ఆశించిన స్దాయిలో సేవలు అందడంలేదు. ప్రజలు అతిసార, కలరా, టైపాయిడ్, మలేరియా, డెంగ్యూ వ్యాధులతో అవస్దలు పడుతున్నారు. నాయకులు, అధికారులు ఓదార్చడం తప్ప ఆరోగ్య విషయాలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ముంపుకు గురైన కొన్ని ప్రాంతాల్లోనే చర్యలు చేపడుతున్నారని, శివారు ప్రాంతాల ప్రజలను సక్రమంగా పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. జ్వరం, జలుబు లక్షణాలు తీవ్రంగా ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించే దుస్దితి నెలకొందని చెబుతున్నారు. గత ఐదు రోజుల నుంచి విష జ్వరాలకు పేరుగాంచిన ఫీవర్ ఆసుపత్రి సీజనల్ వ్యాధుల రోగులతో కిటకిటలాడుతుంది.

రోజుకు 350మందికి పైగా రోగులు వస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. వరద ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రోగులు వస్తున్నట్లు వారికి సేవలందించాలంటే ప్రస్తుతం ఉన్న పడకలు, సిబ్బంది సరిపోవడం లేదని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ముంపు ప్రాంతాల నుంచే వచ్చే రోగులకు కోసం ప్రత్యేక ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని వైద్య సిబ్బంది సూచిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చిన ప్రతి రోగి రక్తనమూనాలు సేకరించి పరీక్షలు చేసిన తరువాతే ఏవ్యాధి సోకిందో నిర్దారించి వైద్య సేవలందిస్తున్నారు. నగరంలో 168బస్తీ దవాఖానలు, 56 పట్టణ అర్బన్ కేంద్రాలు ఉన్న వాటిలో రోజుకు సుమారుగా 50నుంచి 60మందికి వైద్యం అందిస్తున్నారు.

అయిన రోగుల సంఖ్య పెరగడంతో ఫీవర్ ఆసుపత్రికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వందలాదిమంది రోగులతో ఆసుపత్రి సందడిగా మారింది. వ్యాధి లక్షణాలున్న ఎక్కువ ఉన్నవారు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లితే టెస్టులు పేరుతో వేలకు వేలు బిల్లు తీసుకుంటూ దోపిడీ చేస్తున్నారని, పేద,మధ్యతరగతి ప్రజలు వైద్యం కోసం ప్రభుత్వం ఆసుపత్రికి వస్తున్నట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. ఈనెలలో వైరల్ ఫీవర్ 210మంది, టైపాయిడ్ 48, డయేరియా 204, తట్టు 18, చికెన్‌ఫాక్స్ 26, ట్రాన్సిలిటీస్ 171 కేసులు నమోదైనట్లు ఆసుపత్రి అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రభుత్వం తాత్కాలికంగా వైద్య సిబ్బందిని నియమించి రోగులకు సకాలంలో చికిత్సలు అందించేలా చూడాలని వైద్యులు కోరుతున్నారు.

outbreak in patients in fever hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News