Monday, April 29, 2024

ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు: ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

MLC Kavitha extends Saddula Bathukamma greetings

హైదరాబాద్: రాష్ట్ర ప్రజలందరికీ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ అంటేనే ఎంతో సందడిగా ఉటుందని, అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ఎవరింట్లో వాళ్లు, మాస్కులు ధరించి పండుగను జరపుకునే పరిస్థితి ఏర్పాడిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆడబిడ్డలంతా ఉత్సాహంగా బతుకమ్మ పాటలు నెమరు వేసుకుంటూ, యూట్యూబ్‌లో బతుకమ్మ పాటలు వింటూ, పెద్ద ఎత్తున పండుగను జరుపుకుంటున్నట్లు సోష్‌ల్ మీడియాలో చూస్తున్నాం అని కవిత హర్షం వ్యక్తం చేశారు.

ఒక పక్క కరోనా,మరో పక్క హైదరాబాద్‌లో అకాల వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, మనమందరం ఒకరి కొకరు అండగా నిలుస్తూ బతుకమ్మ పండుగను పరిపూర్ణంగా చేసుకోవాల్సిన సందర్భం వచ్చిందన్నారు. వరదల కారణంగా నష్టపోయిన వారందరినీ ఆదుకునేంకు సిఎం కెసిఆర్ తక్షణ సాయంగా రూ. 550 కోట్లను విడుదల చేయడం సంతోషదాయకం అన్నారు. హైదరాబాద్ ప్రజల ఇబ్బందులు త్వరగా తొలగిపోవాలని, గౌరమ్మ తల్లి దయతో కరోనా కనుమరుగవ్వాలని ఎంఎల్‌సి కవిత ప్రార్థించారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే పలువురు మంత్రులు శాసనసభ్యులు రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజించే గొప్పసంస్కృతి తెలంగాణ ఆడబిడ్డలని రాష్ట్రమంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. తీరొక్కపూలతో పేర్చిన అందమైన బతుకమ్మ అనేక ఆనందాలకు ప్రతీకని మంత్రి పేర్కొన్నారు. తండ్రిగా,అన్నగా మేనమామగా సిఎం కెసిఆర్ ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణ నేతన్నలకు చేతినిండా పనికల్పిస్తూ బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. తీరొక్క పూలతో తీరైన రీతిలో అందంగా పేర్చే బతుకమ్మ మనజీవితంలో అనేక ఆనందాలకు ప్రతీకగా అభివర్ణించారు.

ఈ సద్దుల బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డల జీవితాల్లో ఆనందాలను తీసుకురావాలని మంత్రి సత్యవతి రాథోడ్ ఆకాంక్షించారు. తెలంగాణసంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపం ఆడబిడ్డల పూలపండుగ, సద్దుల బతుకమ్మ సందర్భంగా తెలంగాణ ఆడ బిడ్డలందరికీ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిలో లభించే పూలను పూజించే బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకం, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగను అక్కా చెల్లెల్లు సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో తగు జాగ్రతలు తీసుకుని మహిళలు బతుకమ్మను జరపుకోవాలని విజ్ఞప్తిచేశారు. సద్దుల బతుకమ్మ పండుగ సంబురాల్లో స్పీకర్ పోచారం పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News