Saturday, April 27, 2024

అందుబాటులో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్

- Advertisement -
- Advertisement -
Covid-19--vaccine
తక్కువ ధరకే అందజేసేలా సాగుతున్న పరిశోధన : ప్రొఫెసర్ అడ్రియాన్ హిల్స్

లండన్ : కరోనా నిర్మూలనకు వ్యాక్సిన్ల తయారీ కోసం కృషి ఎంత జరుగుతున్నా ఒకవేళ వ్యాక్సిన్ అందుబాటు లోకి వస్తే ధర ఏంత ఉంటుందో సామాన్యులకు లభ్యమౌతుందో లేదో అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తక్కువ ధరతో ఎక్కువ మందికి అందుబాటు లోకి తేవాలన్న లక్షంతో పరిశోధన సాగిస్తున్నామని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకుల్లో ఒకరైన ప్రొఫెసర్ అడ్రియాన్ హిల్స్ వివరించారు.

వ్యాక్సిన్‌ను అందుబాటు లోకి తేడానికి ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు పరిశోధన సాగిస్తున్నారు. సిహెచ్ ఎడిఒఎక్స్1 ఎన్‌సిఒ 19 పేరున సాగుతున్న వీరి పరిశోధన పైనే ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఇప్పటివరకు ఈ వ్యాక్సిన్‌తో కోతులపై చేసిన ప్రయోగాలు ఫలించడంతో ఏప్రిల్‌లో మనుషులపై ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. జులై, లేదా ఆగస్టు నాటికి ఫలితాలు అందుబాటు లోకి వస్తాయని చెప్పారు ఇది సింగిల్ డోస్ వ్యాక్సిన్. తక్కువ ఖరీదే ఉంటుంది.

ప్రపంచ వ్యాప్త సరఫరా చైనుకు అందుబాటులో ఉండబోతుంది. అందువల్ల దీన్ని వివిధ ప్రదేశాల్లో తయారు చేయడానికి వీలవుతుందన్నారు. ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసే సామర్ధం ప్రపంచం లోని ఏడు కేంద్రాలకు ఉందని, వాటిలో భారత్ లోని సీరం ఇనిస్టిట్యూట్ ఒకటని ఆయన తెలిపారు. ఈ సంస్థ ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి పరిశోధనల్లో పాలుపంచుకుంటోంది. చైనా ఐరోపా దేశాల్లో కూడా ఈ కేంద్రాలు ఉన్నాయి.

Oxford vaccine available for Covid 19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News