Monday, April 29, 2024

పాక్ క్రికెట్ జట్టుకు ఊహించని షాక్!

- Advertisement -
- Advertisement -

Pak Head Coach and bowling coach Resigns

కరాచి: టి20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు ప్రధాన కోచ్ మిస్బాఉల్‌హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ తమ పదవులకు రాజీనామ చేశారు. ఈ విషయాన్ని సోమవారం పాక్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఈ క్రమంలోనే మాజీ ఆటగాళ్లు సక్లేన్ ముస్తక్, అబ్దుల్ రజాక్‌లను తాత్కాలిక కోచ్‌లుగా నియమించినట్లు స్పష్టం చేసింది. మరోవైపు పిసిబి నూతన చైర్మన్‌గా మాజీ కెప్టెన్ రమీజ్ రాజా వచ్చేవారం బాధ్యతలు చేపడుతున్న క్రమంలోనే మిస్బా, వకార్ తప్పుకోవడం అనుమానాల కు తావిస్తోంది. కాగా, రమీజ్ గతంలో మిస్బా, వకార్ యూనిస్‌ల పనితీరుపై అసహనం వ్యక్తం చేయడం కూడా ఈ ఊహాగాలను తావిస్తోంది.

Pak Head Coach and bowling coach Resigns

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News