Saturday, April 27, 2024

పాలమూరు-రంగారెడ్డికి గ్రీన్‌సిగ్నల్

- Advertisement -
- Advertisement -

మన కృష్ణా నదీజలాల రాష్ట్రంలో నిర్మిస్తున్న పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులు కొనసాగించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కృష్ణానది నుం చి 7.15 టిఎంసిల నీటిని వినియోగించుకునేందుకు అనుమతించింది. పనులు కొనసాగించుకునేందుకు అనుమతిస్తూ శుక్రవా రం ఆదేశాలు జారీ చేసింది.ఈ వాజ్యంలోప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఆగస్టులో చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తాగు నీటి అవసరాలకు అనుకూలమైనంత మేరకు ప్రాజెక్టు పనులు కొనసాగించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. పర్యావరణ అనుమతులు పొందివున్న 7.15 టిఎంసి ల ఉపయోగించుకోవటానికి సర్వోన్నత న్యాయస్థానం ఆమోదం తెలిపింది.

అయితే తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకు కోవాలని స్పష్టం చేసింది. ప్రజలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొకుండా, ఇబ్బందులకు గురికాకూడదన్న ఉద్దేశ్యంతో ఈ అవకాశం కల్పిస్తున్నట్లు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఈ కేసులో మెరిట్స్ ఆధారంగానే తగిన నిర్ణయాలు ఉంటాయని ధర్మాసనం సూచించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇదివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విధించిన రూ. 500 కోట్ల జరిమానాపై అత్యున్నత న్యాయస్థానం విధించింది.

పాలమూరు-రంగారెడ్డిపై ఎన్జీటి జరిమానా విధిస్తూ.. ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపించింది. ఆరు వారాల్లో ప్రతివాదులందరూ కౌంటర్ అఫిడవిట్‌లు దాఖలు చేయాలని, ఆ తర్వాత ఆరు వారాల్లో వాటికి సమాధానంగా రిజాయిండర్‌లు దాఖలు చేయాలని పిటిషనర్‌ను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టులో చేపట్టనున్నట్లు తెలిపింది.పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి గత నెలలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషనర్ వాదనలను వినాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. అప్పుడు జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ హిమాకోహ్లితో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును రెండు వారాలకు వాయిదా వేసింది. ఇంకా ఆ తీర్పు రాకముందుగానే తాజాగా సుప్రీంకోర్టు పాలమూరు- రంగారెడ్డికి అనుమతులు ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News