Wednesday, May 1, 2024

కెసిఆర్ తరువాత అన్ని పదవులు పొందింది ఈటెలే: పల్లా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈటెల రాజేందర్‌కు సిఎం కెసిఆర్ అన్ని స్థాయిలో పదవులిచ్చి గౌరవించారని ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈటెల బహుజన నాయకుడైతే బడుగు బలహీన వర్గాల భూములు ఎలా కొంటారని ప్రశ్నించారు. ఈటెలది ఆత్మగౌరవం కాదని, ఆస్తుల మీద గౌరవమని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలను తొక్కి పెడుతున్న బిజెపిలో ఈటెల ఎలా చేరుతారని అడిగారు. ఈటెల రాజేందర్ తన ఎంఎల్ఎ పదవికి, టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సందర్భంగా పల్లా మీడియాతో మాట్లాడారు.

రాజేందర్ వెనక ఏ ఆత్మగౌరవ వాదులు, వామపక్షాలు, బహుజన వాదులు లేరని ఆగ్రహం వ్యక్తంచేశారు. ధాన్యం సేకరణ చేయాల్సింది తెలంగాణ ప్రభుత్వ పని కాదన్నారు. ప్రతీ ధాన్యాన్ని కొన్నది దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ చేరబోతున్నది బిజెపి ప్రభుత్వంలోనని, ఎఫ్‌సిఐ ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయటం లేదన్నారు. పథకాల గురించి పూర్త అవగాహన లేకుండా మాట్లాడటాన్ని ఖండిస్తున్నామన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రతీ సమీక్ష మంత్రి ఆధ్వర్యంలోనే జరిగాయని, పని భారంతో ఉన్నానని రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సిఎం కెసిఆర్ సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీతో వీడియో కాన్ఫరెన్స్ ఉంటే కూడా హాజరుకాలేదన్నారు. టిఆర్‌ఎస్‌లో అందరికీ ఆత్మగౌరవం ఉందని, అవగాహన ఉందన్నారు. ఈటెల చేరబోయే పార్టీతో రాజకీయ భవిష్యత్ కనుమరుగవుతోందన్నారు.

ఈటెల రాజేందర్ ఆరోపణలు పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్టుగా ఉందని పల్లా ఎద్దేవా చేశారు. ఈటెల ఆరోగ్య మంత్రిగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి అధికారులను ఎలా వేధించారో వాళ్లకు తెలుసునన్నారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలోనే తెలంగాణ సాధ్యమైందని, టిఆర్‌ఎస్ పార్టీలోకి వచ్చి వెళ్లిన వాళ్లంతా చేసినట్లే ఈటెల ఆరోపణలు ఉన్నాయని పల్లా మండిపడ్డారు. కెసిఆర్ తరువాత అన్ని పదవులు పొందింది ఈటెల ఒక్కరే అని గుర్తు చేశారు. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సీనియర్ అయినప్పటికి సిఎం కెసిఆర్ ఈటెలకు శాసన సభ పక్ష నాయకత్వం ఇచ్చారని, కమలాపూర్‌లో పార్టీ బలంగా ఉన్నప్పుడు 2003లో ఈటెల టిఆర్‌ఎస్ పార్టీ టికెట్ అడిగారని గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News