Thursday, May 9, 2024

రాహులే అధ్యక్షుడు కావాలి

- Advertisement -
- Advertisement -
Party workers want Rahul to be Cong president
అందరి ఆకాంక్ష అదే: కర్నాటక పిసిసి చీఫ్ డికె శివకుమార్

బెంగళూరు: ఈ నెల 16న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానున్న వేళ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు రాహుల్ గాంధీ చేపటాలన్న నేతల ప్రకటనలు మళ్లీ మొదలైనాయి.కర్నాటక పిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలన్నదే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తల ఏకగ్రీవ స్వరమన్నారు. బెంగళూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాహుల్ గాంధీయే పార్టీ బాధ్యతలు చేపట్టాని కోరుకుంటున్నారు. ఆయన రాజీనామా చేసినప్పటినుంచీ ముము ఒత్తిడి చేస్తూనే ఉన్నాం. రాహుల్ ఇప్పటికే 90 శాతం బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అయితే ఆయన పూర్తి స్థాయి బాధ్యతలను చేపట్టాలని కోరుకుంటున్నాం. అక్టోబర్ 16న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఉంది.. చూద్దాం’ అని శివకుమార్ అన్నారు.

మరో వైపు కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ బాధ్యతలు చేపట్టాన్న అభిప్రాయాన్ని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా సోమవారం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో పని చేసేందుకు సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అవకాశం కల్పించినట్లు వచ్చిన ఊహాగానాలపై శివకుమార్ స్పందించారు. దీనిపై నాయకత్వం నిర్ణయం తీసుకోవలసి ఉందని, రాష్ట్రస్థాయిలో అటువంటి చర్చ ఏదీ జరగలేదని అన్నారు. అనేకమంది నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని , వారితో చరలు జరుపుతున్నాట్లు శివకుమార్ చెప్పారు. కర్నాటకలో బొగ్గు, విద్యుత్ కొరతపై సమాచారం సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో విద్యుత్ మిగులు ఉండేదని, ఇతరులకు కూడా విక్రయించినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా శివకుమార్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News