Monday, April 29, 2024

హకీంపేట నిసాలో పాసింగ్ ఔట్ పరేడ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : 16వ బ్యాచ్ అసిస్టెంట్ కమాండెంట్ , 1వ బ్యాచ్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్, ఎగ్జిక్యూటివ్ ట్రైనీల పాసింగ్ అవుట్ పరేడ్ శనివారం నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (నిసా),సిఐఎస్‌ఎఫ్ హకీంపేటలో జరిగింది. 317 మంది ట్రైనీల కోసం కఠోర శిక్షణ విజయవంతంగా ముగిసినట్లు అకాడమీ అధికారులు తెలిపారు. పాసింగ్ ఔట్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అదనపు డైరెక్టర్ జనరల్, జగ్బీర్ సింగ్ పాల్గొన్నారు. ఈ ఈవెంట్ యొక్క ప్రాముఖ్యతను, శిక్షణ పొందిన వారి విజయాన్ని ఆయన నొక్కిచెప్పారు.

ఈ వేడుకలో సీనియర్ ప్రభుత్వ అధికారులు, పోలీసు బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, హైదరాబాద్‌కు చెందిన ప్రభుత్వ రంగ సంస్థలు, సిఐఎస్‌ఎఫ్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. పాసింగ్ అవుట్ కాంటింజెంట్‌లలో 19 మంది అసిస్టెంట్ కమాండెంట్లు, ఎగ్జిక్యూటివ్, 298 మంది అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌లు సమగ్ర శిక్షణను పూర్తి చేసుకున్నారు, ఇండస్ట్రియల్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్, సాఫ్ట్ స్కిల్స్, ఏవియేషన్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, విఐపిసెక్యూరిటీ, లీడర్‌షిప్ వంటి ఇండోర్ విభాగాలు, క్రావ్-మాగా, అర్బన్ టాక్టిక్స్, జంగిల్ వార్‌ఫేర్, తాజా తుపాకీలలో ఆయుధ శిక్షణతో పొందారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News