Friday, May 17, 2024

నిరుపయోగంగా ఉన్న మార్కెట్లను అందుబాటులోకి తేవాలి

- Advertisement -
- Advertisement -

అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న మార్కెట్‌లను గుర్తించి వాటిని అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శనివారం మంత్రి తుమ్మల సచివాలయంలోని తన ఛాంబర్‌లో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. మార్కెటింగ్ శాఖలో ఎన్ని మార్కెట్లు ఉన్నాయి, వాటిలో ఉపయోగంలో ఉన్నవి ఎన్ని,? నిరుపయోగంగా ఉన్నవి ఎన్ని? వాటిని గుర్తించి అందుబాటులోకి తేవడానికి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు .

ఖమ్మం జిల్లా కేంద్రంలోని మిర్చి మార్కెట్టును పూర్తి సౌకర్యాలతో అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పత్తి సాగు, ఉత్పత్తి గణనీయంగా పెరిగినందున పత్తి కొనుగోలుకు తగిన ఏర్పాట్లు చేసి మార్కెట్ యార్డుల్లో రైతులకు కావాల్సిన సకల సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఉపయోగంలో లేని భవనాలు, ఇతర మౌళిక సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీగా ఉంచవద్దని సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News