Saturday, April 27, 2024

ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించండి

- Advertisement -
- Advertisement -
భారీ వర్షాలు, వరదలపై సమీక్షలో అధికారులను ఆదేశించిన సిఎం కెసిఆర్

హైదరాబాద్ : హైదరాబాద్ సహా తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వరద నీటితో పలు ప్రాంతాలు జలాశయాల్లా మారిపోయాయి. గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోందని మొదటి ప్రమాద హెచ్చరికను సైతం జారీ చేశారు. జిహెచ్‌ఎంసి పరిధి లోనూ వర్షాలతో వరద నీరు రోడ్లపై నిలిచిపోయి ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలో సిఎం కెసిఆర్ వర్షాలపై శుక్రవారం సచివాల యంలో సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, సిఎస్ శాంతి కుమారి, పలు శాఖల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు.

రాష్ట్రంలో వర్షాలు, నీటిపారుదల, ఆర్థిక, బిసి శాఖలు, పౌర సరఫరాలు, పంచాయతీరాజ్ శాఖలపై సిఎం కెసిఆర్ సమీక్ష జరిపారు. ముంపు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని, వరద నీరు రోడ్లపై నిలవకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సచివాలయంతో పాటు, కలెక్టరేట్లో, ఎమ్మార్వో ఆఫీసులలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి, సహాయక చర్యల కోసం హెలికాఫ్టర్లను, ఎన్డీఆర్‌ఎఫ్ దళాలను అందుబాటులో ఉంచాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. కంట్రోల్ రూం సహా హెలీకాప్టర్లు సంబంధిత సహాయకచర్యలకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు, భద్రాచలంలో సహాయక చర్యలకు ఏర్పాట్లపై సమీక్షించారు. ఫుడ్‌ప్రాసె సింగ్ పరిశ్రమల ఏర్పాటు చేయాలని, ధాన్యం ఉత్పత్తి మేరకు ఫుడ్‌ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ చర్చించారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు.. తదితర అంశాలపై కీలక సూచనలు చేశారు.

ధాన్యం ఉత్పత్తి మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపై కూడా చర్చ జరిపారు. మరోవైపు గురువారం ఒక్కరోజు అత్యధికంగా 34.5 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం కురిసింది. రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, హనుమకొండ, భువనగిరి జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News