Monday, April 29, 2024

వరవరరావు కవితలను ఇంగ్లీషులో అనువదించనున్న పెంగ్విన్..

- Advertisement -
- Advertisement -

Penguin to translate Varavara Rao's poems in English

న్యూఢిల్లీ: ప్రముఖ విప్లవ కవి వరవరరావు రచించిన కవితల సంకలనాన్ని ఇంగ్లీషులో అనువదించనున్నట్లు పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ప్రచురణ సంస్థ శనివారం ప్రకటించింది. ”వరవరరావు: ఇండియాస్ రివల్యూషనరీ పొయెట్” పేరిట ప్రచురించనున్న సంకలనాన్ని ఎన్ వేణుగోపాల్, మీనా కందసామి ఎడిట్ చేశారు. పెంగ్విన్స్ వింటేజ్ ఇంప్రింట్ కింద ఈ పుస్తకాన్ని వచ్చే ఏడాది ప్రచురించనున్నట్లు పెంగ్విన్ తెలిపింది. ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో ప్రస్తుతం పుణెలోని ఎరవాడ జైలులో ఉన్న వరవరరావు తాను అరెస్టు కావడానికి ముందు తాను రచించిన కవితలలో 75 శాతం కవితలను ఇంగ్లీష్ అనువాదం పుస్తకం కోసం ఎంపిక చేశారు.

వరవరరావు కవితలను అంగ్ల పాఠకులకు అందుబాటులోకి తీసుకురావాలన్న నా దశాబ్దాల కల నెరవేరబోతోందని వరవరరావు మేనల్లుడు, ఈ పుస్తక సహ సంపాదకుడు ఎన్ వేణుగోపాల్ తెలిపారు. వరవరరావు కవితలను రాత ప్రతుల రూపంలోనే చదివిన తొలి పాఠకుడిగా ఇంగ్లీషులోకి ఇప్పుడు అనువాదం పొందనున్న ఈ కవితలు ఆయన సంపూర్థ వ్యక్తిత్వాన్ని, ఆయన నమ్మిన ప్రత్యామ్నాయ ప్రజా రాజకీయాలను, ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కులను, స్వేచ్ఛా కాంక్షను ప్రతిబింబిస్తాయని తాను విశ్వసిస్తున్నట్లు వేణుగోపాల్ చెప్పారు. 79 సంవత్సరాల వరవరరావు రాసిన 13 కవితా సంకలనాలు, ఏడు సాహితీ విమర్శలతోసహా 16 వచన గ్రంథాలు తెలుగులో ఇప్పటివరకు ప్రచురితమయ్యాయి. జైలు నుంచి ఆయన రాసిన లేఖలను క్యాప్టివ్ ఇమాజినేషన్ పేరుతో పెంగ్విన్ సంస్థ ఇదివరకే ప్రచురించింది.

Penguin to translate Varavara Rao’s poems in English

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News