Friday, April 26, 2024

కరోనా నిబంధనలు గాలికి వదిలేసిన జనం

- Advertisement -
- Advertisement -

People Negligence about Corona Precautions

హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా వైరస్ విజృంభించి ప్రాణాలను బలిగొట్టున్న ప్రభుత్వ నిబంధనలు ప్రజలు గాలికొద్దిలేస్తున్నారు. ప్రతి వ్యక్తి వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటించి ముఖానికి మాస్కులు, చేతులకు శానిటైజర్ వినియోగించాలని అధికారులు పదేపదే హెచ్చరిస్తున్న జనం ఇష్టానుసారంగా రోడ్లపై తిరగడంతో మహమ్మారి రెక్కలు కట్టుకుని వైరస్ స్వైర విహారం చేస్తుందని వైద్యశాఖ పేర్కొంటుంది. అన్‌లాక్ -4తో వ్యాపార సముదాయాలు పూర్తిగా కార్యకలపాలు నిర్వహిస్తుండటంతో వైరస్ రోజుకు వందలాదిమందిని కబలిస్తుంది.

దీనికి తోడు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వలసకూలీలు ఉపాధి కోసం పట్టణానికి రావడంతో గుంపులు, గుంపులుగా ఒకే దగ్గర చేరి కూలీ పనులు చేస్తుండటంతో కరోనా మళ్లీ పుంజుకుందని వెల్లడిస్తున్నారు. ఆగస్టుల రెండోవారం నుంచి తగ్గుముఖం పట్టిన వైరస్ సెప్టెంబర్ మొదటి నుంచి పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతుంది. రోజుకు 400లకుపైగా కేసులు నమోదై రాష్ట్రంలో మహానగరంలో అగ్రస్దానంలో నిలిచింది. జిల్లా వైద్యశాఖ గత రెండు నెల నుంచి 196 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానల్లో ఉచితంగా ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారు. రోజుకు అన్ని సెంటర్లలో 8500మందికి టెస్టులు నిర్వహిస్తున్నారు. ఆరునెల కాలంలో గ్రేటర్ వ్యాప్తంగా 97వేలమందికి పరీక్షలు చేయగా,53,846మందికి కరోనా సోకగా, 698మందికి మృత్యువాత పడ్డారు. రోజుకు రోజుకు జనాలు కరోనా నిబంధనలు పాటించకుండా ఉంటే వైరస్ మరింత విజృంబించే అవకాశం ఉందని వైద్యాధికారులు భావిస్తున్నారు.

రోడ్లపై ఉండే తినుబండారాల వద్ద సమూహంగా ఉంటూ మాస్కులు ధరించకుండా గంటల తరబడి మాట్లాడుకోవడంతో రానున్న రోజుల్లో తగ్గుతుందని భావించిన కరోనా రెక్కలు కట్టుకుంటుందని పేర్కొంటున్నారు.తాజాగా నగరంలో మెట్రో రైళ్లు నడవడంతో అందులో రోజుకు వేలాదిమంది ఉద్యోగులు వివిద ప్రాంతాలకు వెళ్లుతుంటారు. మెట్రో అధికారులు ఎన్ని చర్యలు చేపట్టిన రైళ్లలో ఒకరికి లక్షణాలున్న అందరికి సోకే ప్రమాదముందంటున్నారు. దసరా వరకు ప్రజలు జాగ్రత్తలు పాటించి, దగ్గు,జ్వరం, జులుబు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరల్లో ఉన్న ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుని ఇతరులకు సోకకుండా ఉండాలని స్దానిక వైద్యులు సూచిస్తున్నారు. నిర్లక్షం చేస్తే కరోనా విశ్వరూపం దాల్చి ప్రాణాలను హరిస్తుందని హెచ్చరిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News