Saturday, April 27, 2024

పెట్రోలుపై 35 పైసలు, డీజిల్‌పై 15 పైసలు ప్లస్

- Advertisement -
- Advertisement -

Petrol And diesel prices hiked again

న్యూఢిల్లీ: దేశంలో మరోసారి పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోలుపై లీటరుక35 పైసలు చొప్పున, డీజిల్‌పై 15 పైసలు వంతున గురువారం రేట్లు పెంచారు. దీనితో ఇప్పుడు దేశమంతటా పెట్రో ఉత్పత్తుల ధరలు అత్యున్నత స్థాయికి చేరాయి. ఢిల్లీలో ఇప్పుడు పెట్రోలు లీటర్‌కు రూ 101.54 పైసలు అయింది. డీజిల్ రేటు రూ 89.87 పైసలు అయింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఈ మేరక ధరల నోటిఫికేషన్ వెలువరించాయి. గత మూడు రోజులుగా ధర పెరగకుండా నిలిచి ఉంది. ఇంతకు ముందు ఈ నెల 12వ తేదీన పెట్రోలు ధరలు పెరిగాయి. అయితే అదేరోజు డీజిల్ ధరలో స్వల్ప తగ్గుదల చూపారు. మూడు నెలల వ్యవధిలో ఇటువంటి తగ్గింపు ఇదే తొలిసారి అయింది. అయితే ఇప్పుడు తిరిగి డీజిల్ ధరకు రెక్కలు వచ్చాయి. ఇంతకు ముందు తగ్గించిన లీటర్‌కు 16 పైసల విలువను ఇప్పుడు పెంచిన ధర ఇప్పటి పెంపుదలతో తటస్థీకరించినట్లు అయింది. ఇంతకు ముందు పెట్రోలు, డీజిల్‌పై రేట్లు ఎప్రిల్ 15న కొంత మేరకు తగ్గాయి. తరువాతి క్రమంలో ఇవి పెరుగుతూనే పోవడంతో వినియోగదారులైన వాహనవాలాలు డీలా పడ్డారు.

Petrol And diesel prices hiked again

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News