Friday, April 26, 2024

పోచంపల్లి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో మైక్రోచిప్ అమర్చి ఘరానా మోసం

- Advertisement -
- Advertisement -

 

యాదాద్రి భువనగిరి: భూదాన్‌పోచంపల్లి పురపాలక కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ ప్రెటోల్ బంక్‌లో మైక్రోచిప్ ఏర్పాటు చేసి వినియోగదారులను ఘరానా మోసం చేస్తున్న సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. జిల్లా లీగల్ మెట్రాలజీ సీఐ సంజయ్ కృష్ణ, స్థానిక ఎస్సై సైదిరెడ్డి కలిసి పెట్రోల్ బంక్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైక్రోచిప్ ద్వారా ఐదు లీటర్లకు 150 మిల్లిలీటర్లు పెట్రోల్ తక్కువ వస్తుందని ఆయన తెలిపారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా ఏర్పాటు చేసుకొని వినియోగదారులను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. విశ్వసనీయ సమాచారంతో పెట్రోల్ బంక్ ను తనిఖీ చేసామని పేర్కొన్నారు. పెట్రోల్ డీజిల్ శాంపిల్ ను సేకరించి పరీక్ష నిమిత్తం పంపించడం జరిగిందని తెలిపారు. వినియోగదారులను మోసం చేస్తున్న పెట్రోల్ బంకు యాజమాన్యం పై చట్టరిత్య చర్య తీసుకుంటామని హెచ్చరించారు. వీరితోపాటు ఏఎస్‌ఐ శ్రీనివాస్ రెడ్డి, రైటర్ యాదయ్య, పోలిస్ సిబ్బంది కరుణాకర్, రాధాకృష్ణ, జాఫర్ నరేందర్ గౌడ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News