Sunday, April 28, 2024

ఆగస్టు 16 నుంచి ఓయూ పరిధిలో పిజి సెమిస్టర్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -
పరీక్షల తేదీలకు అనుగుణంగా సిలబస్ పూర్తి చేయాలి
ప్రిన్సిపాల్స్‌కు సూచించిన విసి రవిందర్‌యాదవ్

హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ సెమిస్టర్ పరీక్షలు ఆగస్టు 16 నుంచి నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. శనివారం ఉపకులపతి ఆచార్య దండెబోయిన రవిందర్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ప్రిన్సిపల్స్, సంబంధిత అధికారుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు పేర్కొంటూ ఈ నెల 26, 27వ తేదీల్లో ఇంటర్నల్స్, తదుపరి ప్రాక్టికల్స్ పూర్తి చేయాలని పరీక్షల తేదీలకు అనుగుణంగా సిలబస్ పూర్తి చేసుకోవాలని తెలిపారు. విద్యార్థుల అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమావేశం స్పష్టం చేసింది. అకడమిక్ సమస్యలు, విద్యార్థులు లేవనెత్తుతున్న అంశాలపై సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. కొన్ని సబ్జెక్టులకు సంబంధించి సిలబస్ పూర్తి కాలేదన్న విషయమై రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ, ఓఎస్డీ ప్రొఫెసర్ బి. రెడ్యానాయక్ కారణాలపై ప్రిన్సిపల్స్ ను ఆరాతీశారు.

భవిష్యత్తులో తిరిగి ఇలాంటి పరిస్థితి రాకుండ క్యాలెండర్ ప్రకారమే సిలబస్ పూర్తి చేయటం, పరీక్షలు నిర్వహించటం జరగాలని విసి స్పష్టం చేశారు. సాంకేతిక కారణాలతో ఎంసీజే ప్రవేశపరీక్షను తిరిగి నిర్వహించాలని ఇందుకు సంబంధించిన తేదీని వీలైనంత త్వరగా వెల్లడించాలని సమావేశంలో నిర్ణయించారు. మార్కెట్ కు అనుగుణంగా డిమాండ్ ఉన్న కోర్సుల విషయమై సమావేశంలో చర్చ జరిగింది. కొత్తగా ప్రవేశపెట్టిన బీఎస్సీ డాటా సైన్స్, బీఎస్సీ హానర్స్ కంప్యూటర్స్, బీబీఏ రిటైల్ మేనేజ్ మెంట్, ఎంబీఏ టూరిస్ట్ అండ్ ట్రాన్స్ పోర్ట్ మేనేజ్ మెంట్, పీజీ మైక్రోబయాలజీ ప్రెగ్మెంటేషన్ లాంటి సెల్ఫ్ పైనాన్స్ కోర్సులకు అనూహ్య స్పందన వచ్చిందని సంబంధిత ప్రిన్సిపల్స్ తెలిపారు. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా హాస్టళ్లలో ఉత్పన్నమైన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని యూనివర్శిటీ బిల్డింగ్, విద్యుత్తు, ఆరోగ్య, పారిశుధ్య అధికారులను వీసీ ఆదేశించారు. అవసరమైన చోట్ల హాస్టళ్ల చుట్టూ విద్యుత్తు దీపాలను అమర్చాలని సూచించారు.

ఓయూ పరిపాలనా విభాగంలో వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో ఓయూ క్యాంపస్, అనుబంధ కళాశాలల ప్రిన్సిపల్స్, విద్యార్థి వ్యవహారాలు, యూజీసీ వ్యవహారాల డీన్లు, జిల్లా పీజీ కళాశాలల విభాగం, అకడమిక్ ఆడిట్ సెల్, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, బిల్డింగ్ డివిజన్ డైరెక్టర్లు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, చీఫ్ వార్డెన్, మహిళా వసతి గృహం డైరెక్టర్, పౌరసంబంధాల అధికారి, ముఖ్య వైద్యాధికారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News